Share News

Hyderabad: నలుగురు కవలలు క్షేమంగా ఇంటికి..

ABN , Publish Date - Mar 30 , 2025 | 08:52 AM

ఒకే కాన్పులో ఇద్దరు, ముగ్గురు పిల్లలు జన్మించిన విషయాన్ని చూశాం. కానీ.. ఓ మహిళకు ఒకే కాన్సులో నలుగురు పిల్లలు జన్మించారు. నగరంలోని హస్తినాపురానికి చెందిన అమృత అనే మహిళ పండంటి నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, నలుగురు కవలలు క్షేమంగా ఉన్నారు.

Hyderabad: నలుగురు కవలలు క్షేమంగా ఇంటికి..

- నెల రోజుక్రితం నెలలు నిండకుండా ‘నిలోఫర్‌’ జననం

హైదరాబాద్‌ సిటీ: దాదాపు నెల రోజులపాటు వైద్యుల సంరక్షణలో ఉన్న నలుగురు చిన్నారులు క్షేమంగా ఇంటికి వెళ్లారు. శనివారం నిలోఫర్‌ ఆస్పత్రిలో వివరాలను వైద్యులు వెల్లడించారు. నగరంలోని హస్తినాపురానికి(Hastinapur) చెందిన అమృత పురిటి నొప్పులతో నెలల నిండకుండానే(7 నెలలు) ఫిబ్రవరి 22న ఆస్పత్రికి వచ్చింది. వెంటనే ఆమెకు ఆపరేషన్‌ చేయాగా ఒకే కాన్పులో నలుగురు కవలలకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నెలలు నిండకుండానే పుట్టినందున శ్వాస సంబంధిత సమస్యలతో వెంటిలేటర్‌ అవసరం పడింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కాల్పుల కలకలం.. రెండు రౌండ్లు గాలిలోకి..


నిలోఫర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌(Nilofer Hospital Superintendent Dr. Ravikumar), డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ నియోనోటాలజీ ప్రొఫెసర్‌ స్వప్న పర్యవేక్షణలో పది రోజులపాటు వెంటిలేటర్‌పై ఉన్న కవలలకు హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంక్‌ నుంచిపాలు అందజేశారు. దాంతో ఆ పిల్లలు ఇన్ఫెక్షన్‌, జాండిస్‌, కంటి సమస్యల నుంచి బయటపడ్డారు. 35 రోజుల చికిత్స తర్వాత శనివారం నలుగురు కవలలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్టు వైద్యులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

40 ఏళ్లుగా మసిలే జలధారలు!

టెన్త్‌ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం

జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు

కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 30 , 2025 | 08:52 AM