పెండింగ్ వేతనాలు చెల్లించాలని ధర్నా
ABN , Publish Date - Dec 16 , 2024 | 10:12 PM
జిల్లాలోని ఫ్రీ మెట్రిక్ హాస్టల్‌లో పని చేస్తున్న డే, నైట్ వాచ్‌మెన్స్, కుక్స్, కామాటీ, అవుట్ సోర్సింగ్ వర్కర్ల పెండింగ్‌లో ఉన్న ఆరు మాసాల వేతనాలు చెల్లించాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట ఐఎఫ్‌టీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందించారు.

నస్పూర్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ఫ్రీ మెట్రిక్ హాస్టల్‌లో పని చేస్తున్న డే, నైట్ వాచ్‌మెన్స్, కుక్స్, కామాటీ, అవుట్ సోర్సింగ్ వర్కర్ల పెండింగ్‌లో ఉన్న ఆరు మాసాల వేతనాలు చెల్లించాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట ఐఎఫ్‌టీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందించారు.
ఐఎఫ్‌టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి డి. బ్రహ్మనందం మాట్లాడుతూ ఆరు మాసాలుగా వర్కర్లకు వేతనాలు అందడంలేదన్నారు. బడ్జెట్ విడుదల, బిల్లు ట్రెజరీ వెళ్ళడం, కాంట్రాక్టర్‌కు ఎప్పుడు చేరుతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. నేరుగా వర్కర్ల ఖాతాల్లోకి జీతాలు అందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ప్రతీ నెల 5వ తేదీలోగా వర్కర్లకు వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. శ్రీకాంత్, అరుణ, వెంకటేశ్, సంతోష్, విజయ్, రాజన్న, సునిత, ప్రమీల, స్వర్ణలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.