Share News

కోనోకార్పస్‌ చెట్ల తొలగింపు

ABN , Publish Date - Dec 07 , 2024 | 10:47 PM

ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టే కోనోకార్పస్‌ మొక్కలను మున్సిపల్‌ అధికారులు ఎట్టకేలకు తొలగించారు. పచ్చదనం కోసం జిల్లా కేంద్రంలోని డివైడర్ల మధ్య పెంచుతున్న కోనోకార్పస్‌ మొక్కలు ఆరోగ్యరీత్యా ప్రమాదకరమని, వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని పేర్కొంటూ ’ఆంధ్రజ్యోతి’లో ‘కోనోకార్పస్‌ మొక్కలతో ముప్పే’ శీర్షికన ఈ నెల 1న వార్తా కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు శనివారం సిబ్బందితో వాటిని తొలగించారు.

కోనోకార్పస్‌  చెట్ల తొలగింపు

మంచిర్యాల, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టే కోనోకార్పస్‌ మొక్కలను మున్సిపల్‌ అధికారులు ఎట్టకేలకు తొలగించారు. పచ్చదనం కోసం జిల్లా కేంద్రంలోని డివైడర్ల మధ్య పెంచుతున్న కోనోకార్పస్‌ మొక్కలు ఆరోగ్యరీత్యా ప్రమాదకరమని, వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని పేర్కొంటూ ’ఆంధ్రజ్యోతి’లో ‘కోనోకార్పస్‌ మొక్కలతో ముప్పే’ శీర్షికన ఈ నెల 1న వార్తా కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు శనివారం సిబ్బందితో వాటిని తొలగించారు. కోనోకార్పస్‌ మొక్కల కారణంగా ఇతర మొక్కలు పెరగకపోవడంతోపాటు పర్యావరణం, మనుషులు, జంతువులకు హాని కలిగిస్తున్నాయి. ఆ మొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ప్రజలకు అలర్జీ, శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా వంటి రుగ్మతలు కలిగిస్తాయి. అలాగే కోన కార్పస్‌ మొక్క వేర్లు భూమిలో లోతుల్లోకి పాతుకుపోయి, నీటిని అధికంగా వినియోగిస్తుండటంతో సమీప ప్రాంతాల్లో బోర్లలో నీరు లోతుల్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. తద్వారా భూగర్భ జలాలు అడుగంటేందుకు కోనోకార్పస్‌ మొక్కలు దోహదం చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు.

కాగా వార్తా కథనం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు దృష్టికి రావడంతో డివైడర్ల మఽధ్య కోనోకార్పస్‌ మొక్కలను తొలగించి, వాటి స్థానంలో ఇతర మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు ఐబీ చౌరస్తా మొదలుకొని లక్ష్మీ టాకీస్‌ కూడలి వరకు రోడ్డు డివైడర్ల మధ్య ఉన్న కోనోకార్పస్‌ మొక్కలన్నింటినీ తొలగిస్తున్నారు.

Updated Date - Dec 07 , 2024 | 10:47 PM