Share News

సార్టింగ్‌ సేవలు యథాతథం

ABN , Publish Date - Dec 05 , 2024 | 11:05 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే మెయిల్‌ సర్వీస్‌ (ఆర్‌ఎంఎస్‌) సార్టింగ్‌ ఆఫీస్‌ను ఇక్కడి నుంచి తరలించే యోచనను పోస్టల్‌శాఖ ఎట్టకేలకు రద్దు చేసుకొంది. ఈ నెల 7న కార్యాలయం తరలిపోనుండగా, గురువారం ఆ ప్రయ త్నాన్ని విరమించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యా యి.

సార్టింగ్‌ సేవలు యథాతథం

మంచిర్యాల, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే మెయిల్‌ సర్వీస్‌ (ఆర్‌ఎంఎస్‌) సార్టింగ్‌ ఆఫీస్‌ను ఇక్కడి నుంచి తరలించే యోచనను పోస్టల్‌శాఖ ఎట్టకేలకు రద్దు చేసుకొంది. ఈ నెల 7న కార్యాలయం తరలిపోనుండగా, గురువారం ఆ ప్రయ త్నాన్ని విరమించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యా యి. కార్యాలయం తరలింపుతో ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ‘సార్టింగ్‌ ఆఫీస్‌ తరలి పోతోంది..?’’ శీర్షికన నవంబరు 23న ‘ఆంధ్రజ్యోతి’లో కథ నం ప్రచురితమైంది. కథనం సారాంశాన్ని, తమ బాధల ను పోస్టల్‌ ఉద్యోగులు ఆ శాఖ ప్రధాన కార్యాలయానికి మెయిల్‌ ద్వారా పంపడంతో పునరాలోచించిన ఉన్నతాధి కారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ మేరకు కార్యాలయాన్ని జిల్లా కేంద్రంలోనే కొనసాగిస్తూ ఢిల్లీలోని ఢాక్‌ భవన్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆఫీస్‌ను కాజీపేటలో ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌హెచ్‌ కార్యాలయానికి తరలించే ప్రయత్నాలు జరగగా, ఆంధ్రజ్యోతి కథనంతో రద్దు అయ్యాయి. ఒకవేళ సార్టింగ్‌ ఆఫీస్‌ను తరలిస్తే పోస్టల్‌ సేవలకు కనీసం రెండు మూడు రోజులు వేచి చూసే పరిస్థితులు ఉండేవి. ఉన్నతాధికారుల తాజా నిర్ణయం మేరకు ఇకమీదట 24 గంటలలోపే రిజిస్టర్డ్‌, ఆర్డినరీ పోస్టల్‌ సేవలు అందనున్నాయి.

తిరిగి రానున్న స్పీడ్‌ పోస్ట్‌ కార్యాలయం

గతంలో మంచిర్యాల నుంచి తరలిపోయిన స్పీడ్‌ పోస్ట్‌ కార్యాలయం కూడా తిరిగి వెనక్కి రానుంది. ఈ మేరకు గురువారం జారీ అయిన ఉత్తర్వుల్లో పోస్ట్‌ల్‌శాఖ ఈ విషయాన్ని పేర్కొంది. గతంలో స్పీడ్‌ పోస్టు కార్యాల యాన్ని సైతం కాజీపేటలోని ఎన్‌ఎస్‌హెచ్‌కు 2018లో తరలించడంతో ప్రస్తుతం అక్కడి నుంచే ఉత్తరాలు పంపిణీ అవుతున్నాయి. స్పీడ్‌ సేవలు అందుబాటులో ఉన్నప్పుడు 24 గంటలలోపు సేవలు అందేవి. ప్రస్తుతం మూడు, నాలుగు రోజుల సమయం పడుతోంది. ప్రస్తు తం స్పీడ్‌ పోస్ట్‌ కార్యాలయం కూడా వెనక్కి వస్తుం డడంతో 24 గంటల సేవలు పునరుద్ధరణ కానున్నాయి. ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో జనాదరణ ఉన్నచోట గతంలో తరలించిన స్పీడ్‌ పోస్టు సేవలను ప్రస్తుతం కొనసాగుతున్న రిజిస్టర్‌, ఆర్డినరీ సేవలు అందిస్తున్న సార్టింగ్‌ కార్యాలయాల్లోనే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు గతంలో ఉన్న స్పీడ్‌ పోస్ట్‌ కార్యాల యం ఇతర పనులకు వినియోగిస్తుండగా, సార్టింగ్‌ ఆఫీస్‌లోనే స్పీడ్‌ పోస్ట్‌ సేవలకు ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఒకే కార్యాలయంలో రెండు రకాల సేవలు అందుబాటులో ఉండనుండగా, వినియోగ దారులు రెండు వేర్వేరు పనులను ఒకేచోట నుంచి పూర్తి చేసుకునే వెసలుబాటు కలగనుంది.

ఉద్యోగ సంఘాల హర్షం

సార్టింగ్‌ ఆఫీస్‌ తరలింపు నిలిచిపోవడం, ఆరేళ్ల క్రితం తరలించిన స్పీడ్‌పోస్ట్‌ కార్యాలయం తిరిగి మంచిర్యాలకు వస్తుండటంతో తపాలశాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్టింగ్‌ కార్యాలయం తరలింపు తేదీలు నిర్ణయించడం, ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమైన సమ యంలో వార్తా కథనం ప్రచురితం కావడం పట్ల వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కార్యాలయాలు వెనక్కి రావడం హర్షనీయం

ఎండీ లతీఫ్‌, ఆర్‌ఎంఎస్‌ ( నాయకుడు, మంచిర్యాల

మంచిర్యాల నుంచి తరలిపోయిన రెండు పోస్టల్‌ కార్యాలయాలు వెనక్కి రావడం హర్షించతగ్గ విషయం. వార్తా కథనంతో కార్యాలయాలు తిరిగి వచ్చేందుకు కృషి చేసిన ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు. కార్యాలయాలు తిరిగి రావడం వల్ల వినియోగదారులకు సకాలంలో సేవలు అందుతాయి. ముఖ్యంగా స్పీడ్‌ పోస్ట్‌ సేవల వల్ల ప్రజ లకు మేలు కలుగుతుంది. కార్యాలయాలు తిరిగి రావడం వల్ల వినియోగదారులతోపాటు తపాలశాఖ ఉద్యోగులకూ అవస్థలు తప్పినట్లయింది.

Updated Date - Dec 05 , 2024 | 11:05 PM