KTR: టీఎస్పీఎస్సీ చైర్మన్‌కు కేటీఆర్ ఫోన్... కారణమిదే!
ABN , Publish Date - Jul 03 , 2024 | 12:16 PM
Telangana: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేశారు. ఏఈఈ సివిల్ ఉద్యోగుల నియామక భర్తీకి సంబంధి సెలక్షన్ జాబితాను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నందినగర్ నివాసంలో కేటీఆర్‌ను ఏఈఈ (సివిల్) రాసిన అభ్యర్థులు కలిశారు.
హైదరాబాద్, జూలై 3: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి (TSPSC Chairman Mahender Reddy) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) ఫోన్ చేశారు. ఏఈఈ సివిల్ (AEE Civil) ఉద్యోగుల నియామక భర్తీకి సంబంధించి సెలక్షన్ జాబితాను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నందినగర్ నివాసంలో కేటీఆర్‌ను ఏఈఈ (సివిల్) రాసిన అభ్యర్థులు కలిశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Government) హయాంలో నోటిఫై చేసిన 1180 పోస్టులకు పరీక్షలు జరిగాయి.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడి పొడగింపు.. ఎప్పటి వరకంటే..
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎంపిక జాబితాను పెండింగ్‌లో పెట్టిందన్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి అభ్యర్థులు తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. ఈ విషయానికి సంబంధించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో మాట్లాడారు. సెలక్షన్ జాబితాను వెంటనే విడుదల చేయాల్సింది మాజీ మంత్రి కేటీఆర్ కోరారు.
ఇవి కూడా చదవండి...
BNS Act: బీఎన్ఎస్ యాక్ట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మొట్టమొదటి కేసు...
Nokia Team: సీఎం రేవంత్ రెడ్డితో జర్మనీ ప్రతినిధుల భేటీ
Read Latest Telangana News AND Telugu News