Kavitha: నేడు నాలుగో రోజు ఈడీ కస్టడీలో కవిత
ABN , Publish Date - Mar 20 , 2024 | 07:55 AM
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నాలుగో రోజు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈసీ) అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో కవితను విచారిస్తున్నారు.
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసు (Liquor scam case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)ను నాలుగో రోజు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ED) అధికారులు కస్టడీ (Custody)లోకి తీసుకుని విచారించనున్నారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత పాత్ర.. రూ.100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా కేజ్రీవాల్‌తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. రోజులో 6-7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిఖిత పూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాగా ఈడీ కార్యాలయంలోని క్యాంటీన్లో కవిత భోజనం చేస్తున్నారు.
తల్లి, కుమారులను కలుసుకునేందుకు అనుమతి
ఈడీ కస్టడీలో ఉన్న కవిత.. తన తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరీమణులు అఖిల సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్‌ను కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబసభ్యులను కలుసుకునేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. కవితను మంగళవారం ఆమె సోదరుడు కేటీఆర్, న్యాయవాది మోహిత్‌రావు కలిశారు. కేసుకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్టు తెలిసింది. కవిత తల్లి శోభ బుధ, గురువారాల్లో ఢిల్లీకి రానున్నట్టు సమాచారం. కాగా, రోజురోజుకూ కవిత విచారణ సమయాన్ని ఈడీ పెంచుతోంది. మంగళవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 4.15 వరకు ప్రశ్నించినట్టు సమాచారం. ఆ తర్వాత కొద్దిసేపు టీ విరామం ఇచ్చి, మళ్లీ విచారణను ప్రారంభించినట్టు తెలిసింది. అందుకే, ప్రతిరోజూ 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు కలిసేందుకు అవకాశం ఇవ్వగా, మంగళవారం మాత్రం 7 తర్వాత అనుమతించారు.