BRS: లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలి: హరీష్‌రావు
ABN , Publish Date - Nov 12 , 2024 | 09:12 AM
లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఫార్మా భూ సేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం సరికాదన్నారు.
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై (Revanth Reddy Govt.,) బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) ‘ఎక్స్’ (X) వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు (Comments) గుప్పించారు. ప్రభుత్వ తీరు అమానుషమని ... లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఫార్మా భూ సేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం సరికాదన్నారు. అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరైందికాదని.. ప్రభుత్వం తీరును ఖండిస్తున్నామని, ప్రజాభిప్రాయాన్ని తీలుసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశ్యం తెలియాలన్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేపడుతున్న భూసేకరణను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న గ్రామస్థులను, రైతులను తక్షణం విడుదల చేయాలని హరీష్‌రావు మరోసారి డిమాండ్ చేశారు.
పిచ్చోడి చేతిలో రాయి
కాగా తెలంగాణ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఆ రాయే ఇప్పుడు వికారాబాద్ రైతన్నలపై పడిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌పై ఉన్న కోపాన్ని రైతులు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై చూపారని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు దగ్గర్లో ఫార్మా సిటీ కోసం 15 వేల ఎకరాలను కేసీఆర్ హయాంలో సేకరించామని, అన్ని అనుమతులు తెచ్చామని గుర్తు చేశారు. అలాంటి భూమిని వదిలేసి.. పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు పెట్టడం తగదన్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని సీఎం తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్యను తెచ్చిపెట్టారన్నారు. కాగా, కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయని ఆరోపించారు.
పండించిన పంటను కనీస మద్దతు ధరకూ అమ్ముకోలేని దుస్థితికి తెలంగాణ రైతాంగాన్ని చేర్చిన ఘనత కాంగ్రె్‌సకే దక్కుతుందని సోమవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పత్తి కొనుగోలు చేయబోమని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ప్రకటిస్తే.. సమస్యకు పరిష్కారం చూపకపోవడం సిగ్గుచేటన్నారు. పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రికి.. రాష్ట్రంలో మంత్రులకు రైతుల సమస్యలు పట్టించుకునే సమయం లేదా? అని ప్రశ్నించారు. కాగా, మద్యం అమ్మకాల లక్ష్యం చేరుకోలేదని 30మంది ఎక్సైజ్ సీఐలకు మెమోలు జారీచేయడం కాంగ్రెస్ సర్కారు డొల్లతనాన్ని బయటపెడుతోందని హరీశ్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్
ఏఐసిసి అంతర్గత సమావేశంలో పాల్గొనున్న సీఎం రేవంత్
వర్రా రవీంద్ర రెడ్డికి 14 రోజుల రిమాండ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News