ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jaggareddy: బీఆర్ఎస్ నేతలకు ప్రోటోకాల్‌పై మాట్లాడే అర్హత లేదు

ABN, Publish Date - Jul 16 , 2024 | 07:12 PM

బీఆర్ఎస్ నేతలకు ప్రోటోకాల్‌పై మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి సబితారెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామని.. ఆమెకు గౌరవం ఇవ్వకపోతే అడగాలని.. మర్యాద లోపం ఉంటే తప్పు పట్టాలని అన్నారు.

Jaggareddy

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలకు ప్రోటోకాల్‌పై మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి సబితారెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామని.. ఆమెకు గౌరవం ఇవ్వకపోతే అడగాలని.. మర్యాద లోపం ఉంటే తప్పు పట్టాలని అన్నారు. మల్కాజ్‌గిరి ఈటల కార్యక్రమానికి వెళ్లకుండా ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమానికి ఈటల తెరలేపారని చెప్పారు. గాంధీభవన్‌లో జగ్గారెడ్డి ఈరోజు(మంగళవారం) మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రోటోకాల్ లేకుండా కొందరు బతహకలేకపోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టెన్షన్ లేకుండా పని చేస్తున్నామని సెక్రటేరియట్ ఉద్యోగులు చెబుతున్నారని అన్నారు. పదేళ్లలో రేషన్ కార్డే దిక్కు లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చానని కాలర్ ఎగరేసి చెప్పగలరా? అని ప్రశ్నించారు.


‘‘కాంగ్రెస్ వచ్చాకే రేషన్ కార్డులు ఇస్తున్నాం. పార్టీలు మారడం కామన్. ఇది సీరియస్ మ్యాటర్ కాదు. పాలిటిక్స్‌లో రాజకీయ పార్టీలు అత్తగారిల్లు, తల్లి గారిల్లు లాగా అయిపోయాయి. ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని ప్రజలు కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు. పార్టీ మార్పుపై మాట్లాడడం అవసరమే లేదు. కాంగ్రెస్ చరిత్రతో పోలిస్తే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వయస్సు, అనుభవం చాల చిన్నది. పదేళ్ల అనుభవంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ అ,ఆ లు కూడా నేర్చుకోలేకపోయారు. ప్రతిపక్షాలను గౌరవించేది కాంగ్రెస్ ప్రభుత్వమే. హరీష్‌రావు, కేటీఆర్‌లకు మతిమరుపు వచ్చినట్టుంది. వారు హాస్పిటల్‌కు వెళ్లి చెక్ చేయించుకోవాలి. నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మాట్లాడితే కేటీఆర్, హరీష్ రావులను పిచ్చొళ్లుగా అర్థం చేసుకుంటారు. రేవంత్ ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రోటోకాల్ పాటించారా? రేవంత్ విషయంలో ప్రోటోకాల్ పాటించని బీఆర్ఎస్ నేతలకు ప్రోటోకాల్‌పై మాట్లాడే అర్హత లేదు. కోమటిరెడ్డి, సంపత్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కుట్ర చేసి అసెంబ్లీకి రానివ్వకుండా చేసినప్పుడు ప్రోటోకాల్ గుర్తుకురాలేదా? వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవాలని ఆ పార్టీ నేతలే మొక్కుకున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేతో హరీష్ రావు కొబ్బరికాయ కొట్టించాడు. సీఎం, మంత్రులను రోజూ చాలామందిని కలుస్తున్నారు’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jul 16 , 2024 | 07:12 PM

Advertising
Advertising
<