Share News

NTR Jayanti: ఎన్టీఆర్ జయంతి.. నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

ABN , Publish Date - May 28 , 2024 | 06:52 AM

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం మనుమలు, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.

NTR Jayanti: ఎన్టీఆర్ జయంతి.. నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు జయంతి (NTR Jayanti) సందర్భంగా మంగళవారం ఉదయం మనుమలు, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR), కళ్యాణ్ రామ్‌లు (Kalyan Ram) ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) వద్ద ఘనంగా నివాళులర్పించారు.


కాగా ఎన్టీ రామారావు జయంతిని మంగళవారం తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించనున్నారు. సాధారణంగా ఏటా ఈ సమయంలో టీడీపీ మహానాడు పెద్దఎత్తున జరుగుతుంది. ముఖ్యనేతలంతా మహా నాడులో పాల్గొంటే గ్రామ, మండల స్థాయి నాయ కులు, ఎన్టీఆర్‌ అభిమానులు స్థానికంగా ఎక్కడికక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులో ఉంది. దీంతో పార్టీ అధిష్ఠానం మహానాడును వాయిదా వేసి జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ఎక్కడికక్కడ కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చింది. అయితే అలా కూడా సాఫీగా నిర్వహించేందుకు కోడ్‌ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్‌ అమలు నేపథ్యంలో అన్నిరకాల రాజకీయ నాయకుల విగ్రహాలకు యంత్రాంగం ముసుగులు వేయడంతోపాటు ఆయా ప్రాంతాల్లో సభలు, సమావేశాల నిర్వహణను రద్దు చేశారు. పోలింగ్‌ ముగిసినా ఇంకా లెక్కింపు పూర్తికాక కోడ్‌ అమలులోనే ఉంది. దీంతో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం, అక్కడ సభలు, సమావేశాలు ఇతర కార్యక్రమాల నిర్వహణకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో మండల, జిల్లా పార్టీ కార్యాలయాలలో ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమాలను నిర్వహించాలని టీడీపీ అధిష్ఠానం సూచించింది. ఆ ప్రకారం కార్యాలయాలు ఉన్న చోట వాటిల్లోనూ, లేనిచోట పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్థలాల్లోనూ ఎన్టీఆర్‌ చిత్రపటాలు ఏర్పాటు చేసి నివాళులర్పించడంతోపాటు ఇతర కార్యక్రమాల నిర్వహణకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు.


ntr1.jpg

అలాగే ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన సినీ స్వరాభిషేకం ప్రేక్షకులను అలరించింది. మంగళవారం నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి (26వ తేదీ) మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్రభారతి కళావేదికలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గాయనీ గాయకులు ఎన్టీఆర్‌ సినిమాలలోని పాటలను ఆలపించారు. ఈ సందర్భంగా సినీరంగ నటుడు డాక్టర్‌ ముసా ఆలీఖాన మాట్లాడుతూ కళామతల్లి కన్నబిడ్డ నటరత్న ఎన్టీఆర్‌ తన నటనతో ప్రజలకు చేరువై రాజకీయాలతో పేదలను ఆదుకుని ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఆయనకు సినీ నీరాజనం అర్పించటం పట్టణంలో కొత్త ఒరవడిని సృష్టించిందన్నారు. అనంతరం ఇటీవల డాక్టరేట్‌ అవార్డు పొందిన మునీర్‌ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చ సైదులు, సాం కేతిక విభాగం అధ్యక్షుడు రావిరాల నరేందర్‌, నిర్వాహకులు జకినాలపల్లి శ్రీనివాసచారి, కందుకూరి సుదర్శన, సత్యనారాయణచారి, ఏలె సత్యనారాయణ, గాయనీ, గాయకులు బుర్రి వెంకటేశ్వర్లు, అబ్రహం, సరస్వతి, మౌనిక, సుజాత, రజిత, పరమేశ్వరి, సత్యనారాయణచారి, మురళి, కిషనరావు, శ్రీనివాస్‌, రచయిత వం గాల సైదాచారి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుక్కపట్టి ఏడ్చిన పొన్నవోలు!

కవితను తప్పించేందుకే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 28 , 2024 | 06:52 AM