Kishan Reddy: స్టాలిన్ సమక్ష్యంలో వారిద్దరూ ఒకటయ్యారు.. కిషన్‌రెడ్డి హాట్ కామెంట్స్
ABN , Publish Date - Mar 22 , 2025 | 10:09 PM
Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌లపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ సమక్ష్యంలో ఇద్దరు ఒకటయ్యారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: డీలిమిటేషన్ విషయంలో మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఇవాళ(శనివారం)ముషీరాబాద్ నియోజకవర్గంలో రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్ , స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్ని ప్రాంతాలకు, అన్నివర్గాలకు మోదీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు. దక్షిణ భారతదేశానికి ఎక్కడ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. దక్షిణ భారత అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దక్షిణ భారతదేశానికి సంబంధించి విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదని కిషన్‌రెడ్డి చెప్పారు.
అన్ని ప్రాంతాలకు బీజేపీ సమన్యాయం చేస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌కు దురద పుడితే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీమంత్రి కేటీఆర్ వెళ్లి గొకుతున్నారని విమర్శించారు. డీలిమిటేషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే విపక్షాల నేతలు లేని పోని హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. తమ స్వార్థ రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
రేవంత్ , బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం: ఏలేటి మహేశ్వర రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డితో మాజీ మంత్రి హరీష్‌రావు భేటీ తర్వాతే కేటీఆర్ చెన్నై వెళ్లారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి విమర్శించారు. చెన్నై సమావేశం తర్వాత రేవంత్, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం బయట పడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఇండియా కూటమిలో లేదు.. అయిన చెన్నై ఎందుకు వెళ్లారని నిలదీశారు. ఇండియా కూటమిలో బీఆర్ఎస్ కలుస్తుందా అని ప్రశ్నించారు. మరెందుకు కేటీఆర్ అఖిలపక్షం మీటింగ్‌కు వెళ్లారని నిలదీశారు. బీఆర్ఎస్ అవినీతిని వంద రోజుల్లో బయటపెడతానని సీఎం రేవంత్ చెప్పారని అన్నారు. 15 నెలలు గడుస్తున్నా బీఆర్ఎస్ అవినీతిని సీఎం రేవంత్ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఈ మీటింగ్‌తో రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ఏలేటి మహేశ్వర రెడ్డి విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News