Share News

Kishan Reddy : వరద బాధితులకు కేంద్ర సాయం.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 03 , 2024 | 07:53 PM

వరదల్లో చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 3లక్షలు వస్తాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన రూ. 5లక్షల్లో కేంద్రం ఇచ్చే రూ. 3లక్షలు కలుపుకొని ఇస్తారా? లేదా? రాష్ట్ర ప్రభుత్వమే రూ. 5లక్షలు ఇస్తోందా? అనే విషయంపై క్లారిటీ లేదని కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy : వరద బాధితులకు కేంద్ర సాయం.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Kishan Reddy

హైదరాబాద్: వరదల్లో చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 3లక్షలు వస్తాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన రూ. 5లక్షల్లో కేంద్రం ఇచ్చే రూ. 3లక్షలు కలుపుకొని ఇస్తారా? లేదా? రాష్ట్ర ప్రభుత్వమే రూ. 5లక్షలు ఇస్తోందా? అనే విషయంపై క్లారిటీ లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు (మంగళవారం) బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి.. వారం రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే రూ. 16వేలు, వారం లోపుల ఆస్పత్రిలో ఉంటే రూ. 4 వేలను ఆస్పత్రి ఖర్చులకు కేంద్రం ఇస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.


ALSO Read: Jagadish reddy: పథకం ప్రకారమే మాపై దాడి

ఎస్డీఆర్ఎఫ్ నిధులతో బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. యుటిలైజేషన్ నిధులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి రిపోర్ట్ విడుదల చేయలేదని చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్ కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ. 1300 కోట్లకు పైగా నిధులు ఉన్నాయని తెలిపారు. మరో రూ. 200 కోట్లు యూసీ నిధులున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తే కేంద్ర ప్రభుత్వం దానికి తగిన నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పారు.


ALSO Read: BRS VS Congress: ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ మాజీ మంత్రులపై దాడి.. ఎందుకంటే..?

అంటు వ్యాధులు సోకకుండా మెడిసిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. 1948లో నిజాం లొంగిపోయిన రోజు... గణేష్ నిమజ్జనం ఒకేరోజు జరిగిందని చెప్పారు. మళ్లీ 75ఏళ్ల తర్వాత ఇది రిపేట్ అవ్వడం సంతోషమని కిషన్‌రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Etela: వరద ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటన

Mahesh kumar: బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 03 , 2024 | 08:07 PM