Telangana: తెలంగాణ మంత్రులపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 26 , 2024 | 10:57 AM
Telangana: తెలంగాణ మంత్రులపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ ఇంటెలెక్చ్యువల్ ఫోరమ్ ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశంలో మల్లన్న మాట్లాడుతూ.. బీసీల పట్ల కాంగ్రెస్ మంత్రులు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. రెడ్డి మంత్రులు ఎవరు కూడా గెలవకుండా చేసుడు బీసీల లక్ష్యం కావాలన్నారు.
హనుమకొండ, ఆగస్టు 26: తెలంగాణ మంత్రులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ ఇంటెలెక్చ్యువల్ ఫోరమ్ ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశంలో మల్లన్న మాట్లాడుతూ.. బీసీల పట్ల కాంగ్రెస్ మంత్రులు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. రెడ్డి మంత్రులు ఎవరు కూడా గెలవకుండా చేసుడు బీసీల లక్ష్యం కావాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించాడానికి కృషి చేస్తానని తెలిపారు. బీసీల రిజర్వేషన్లు అమలుచేయకపోత్తే భూకంపం పుట్టిస్తానన్నారు.
KTR : 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్.. ఏం చేయబోతున్నారు..?
కుక్కలు, పందులు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం వద్ద లెక్క ఉంది కానీ... బీసీలు ఎంత మంది ఉన్నారో లేవంట అంటూ మండిపడ్డారు. తెలంగాణలో బీసీల ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. తన గెలుపులో బీఆర్ఎస్ నేతల కృషి ఉందన్నారు. కుల సంఘాలకు బిచ్చం వేసినట్టు నిధులు కేటాయించుడు పాలకులు మానుకోవాలని హితవుపలికారు. బీసీల ఐక్యతను చూసి పాలకులు ఓర్వలేక పోతున్నారన్నారు. అడుక్కొని తాను టికెట్ తెచ్చుకోలేదు... డిమాండ్ చేసి తెచ్చుకున్నానన్నారు. ‘‘బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఎంత... మాపై ఉన్న అప్పులు ఎంతో చెప్పాలని మల్లన్న డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
TPCC: టీపీసీసీ చీఫ్‌గా మహేష్ గౌడ్.. ఏ క్షణమైనా ప్రకటన..?
Read Latest Telangana News And Telugu News