Seethakka: భారత్‌కి కాంగ్రెస్ నాయకత్వం అవసరం
ABN , Publish Date - Jan 11 , 2024 | 09:56 PM
భారత్‌కి కాంగ్రెస్ నాయకత్వం అవసరమని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం నాడు మంత్రి సీతక్క ( Minister Sitakka ) మీడియాతో మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేందుకు నిర్మాణాత్మక సూచనలను ఏఐసీసీ అగ్రనేతలు ఇచ్చారన్నారు.
ఢిల్లీ: భారత్‌కి కాంగ్రెస్ నాయకత్వం అవసరమని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం నాడు మంత్రి సీతక్క ( Minister Sitakka ) మీడియాతో మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేందుకు నిర్మాణాత్మక సూచనలను ఏఐసీసీ అగ్రనేతలు ఇచ్చారన్నారు. పోల్ మేనేజ్మెంట్, ప్రజలతో మమేకమవడం వంటి అంశాల్లో మార్గానిర్ధేశం చేశారని తెలిపారు. తమకు బాధ్యత కల్పించిన స్థానాలల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. త్వరలోనే అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి నివేదిస్తామన్నారు. ఫిబ్రవరి లోపు ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు. ఆదిలాబాద్‌లో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని అధిష్టానానికి నివేదిక ఇస్తామని తెలిపారు. అభ్యర్థి ఎవరైనా అధిష్టానం నిర్ణయం మేరకు పనిచేస్తామన్నారు. ఆదిలాబాద్‌లో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నామన్నారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.