TS Politics: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే?
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:33 PM
Telangana: బీఆర్‌ఎస్‌కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే.. ఆయనతో చాలా సేపటి వరకు చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) అనుకోని ఓటమి తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ (BRS) ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటుందో అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో అప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకున్న నేతలు ఒక్కొక్కరుగా.. గుడ్‌బై చెప్పేస్తున్నారు. గులాబీ బాస్ కేసీఆర్‌కు (BRS Chief KCR) ఎంతో నమ్మకంగా ఉన్న ముఖ్యనేతలు కూడా పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లోకి చేరిపోతున్నారు. బీఆర్‌ఎస్‌కు ఎలాంటి పరిస్థితి ఎదురైందంటే.. ఒకానొక దశలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులను కూడా కేసీఆర్ వెతుక్కోవాల్సి దుస్థితి ఏర్పడింది. చివరకి ఎలాగోలా పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థులను ఖరారు చేశారు బాస్. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి ముఖ్యనేతలు పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా ఆ లిస్టులో మరో కీలక నేత, ఎమ్మెల్యే చేరబోతున్నారనే వార్త జోరుగా వినిపిస్తోంది.
AP Politics: మంత్రి జోగికి స్వయానా బామ్మర్థులే ఎలాంటి షాకిచ్చారో చూడండి..
రేవంత్‌ను కలిసిన ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (Rajendranagar BRS MLA Prakash goud) కాంగ్రెస్‌లో (Congress) చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే కలవడం ఆ వార్త నిజమనేలా చేసింది. దీంతో కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే.. ఆయనతో చాలా సేపటి వరకు చర్చలు జరిపినట్లు సమాచారం. సీఎం రేవంత్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కలిసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. రేపు(శనివారం) ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోని చేరబోతున్నారని తెలుస్తోంది.
Elections 2024: ఎన్నికల వేళ హింసతో అట్టుడుకుతున్న బెంగాల్.. కూచ్ బిహార్ లో రాళ్లదాడి..
ఆనాడే వార్తలు వచ్చినా...
కాగా.. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా మంచి మిత్రులు. వీరిరువురు టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ తరువాత జరిగిన పరిణమాల్లో ప్రకాష్‌గౌడ్ బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోగా.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో రావడం.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం త్వరత్వరగా జరిగిపోయాయి. అలాగే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ తరపున రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆయనను కలిశారు. అప్పుడే ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాను నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్లు చెప్పుకొచ్చారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే. కాగా.. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రకాష్‌గౌడ్ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: పదేళ్ల గాయానికి ఓటుతో చికిత్స చేయండి.. ఓటర్లకు రాహుల్ గాంధీ పిలుపు..
Israel-Iran conflict: దూసుకొచ్చిన డ్రోన్లను కూల్చేశామంటున్న ఇరాన్.. ఇజ్రాయెల్ నో కామెంట్స్!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...