Tammineni: కాంగ్రెస్ పార్టీపై తమ్మినేని సెన్సేషనల్ కామెంట్స్
ABN , Publish Date - Oct 24 , 2024 | 02:37 PM
Telangana: బీజేపీపై సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం విమర్శలు గుప్పించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టె పని బీజేపీ చేస్తోందని ఆరోపించారు. వాగ్ధానాలను అమలు చేయలేని స్థితిలో బీజేపీ ఉందన్నారు. ఈ విధానం కొనసాగితే దేశం విచ్ఛినం అవుతుందని అన్నారు.
ఖమ్మం, అక్టోబర్ 24: బీజేపీపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (CPM Leader Tammineni Veerabhadram) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తోందని, అలాగే వాగ్ధానాలను నెరవేర్చలేని స్థితిలో ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే తక్కువ సీట్లు వచ్చాయని తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపైనా సీపీఎం నేత పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని చెబుతూనే, రైతు బంధుపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Jagan: తనకు తానే ప్రతిపక్ష హోదా ఇచ్చుకున్న జగన్..
గురువారం జిల్లాలోని నేలకొండపల్లి మండలం ముఠాపురం మండల మహాసభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీది దుర్మార్గపు సిద్ధాంతమని వ్యాఖ్యలు చేశారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టె పని బీజేపీ చేస్తోందని ఆరోపించారు. వాగ్ధానాలను అమలు చేయలేని స్థితిలో బీజేపీ ఉందన్నారు. ఈ విధానం కొనసాగితే దేశం విచ్ఛినం అవుతుందని అన్నారు. బీజేపీని గద్దె దించడానికి ఇండియా కూటమి ఏర్పాటు చేశామని తెలిపారు. కాంగ్రెస్ వర్గ స్వభావం తమకు తెలుసన్నారు. బీజేపీ పరిపాలన కొనసాగితే ప్రజాస్వామ్యం ఉండదన్నారు. బీజేపీ గతంలో కంటే సీట్లు కోల్పోయిందని.. చావు తప్పి కన్నులొట్ట పోయి అధికారంలోకి వచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కుటుంబ పరిపాలనతో, అవినీతితో వ్యతిరేక వచ్చిందన్నారు. కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉన్నప్పటికీ కేసీఆర్ మీద కోపంతో గెలిచిందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరుగుతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు. రుణమాఫీ పూర్తిగా అమలు జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బు కొరతతోనే రుణమాఫీ చేయడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఎత్తేసే ఆలోచనలో ఉందేమో ప్రకటన చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించడం లేదని విమర్శించారు. చేసిన వాగ్ధానాలను అమలు చేయకుండా హైడ్రా పేరుతో కొత్త వాటిని అమలు చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు.
High Court: విజయసాయిరెడ్డి కుమార్తె కేసు.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారా.. హైకోర్టు ఆరా..
హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ చేసిన భూమిని చట్టబద్ధం అని ప్రజలు అనుకున్నారని.. కానీ నోటీసులు కూడా ఇవ్వకుండా వాటిని కూలగొడితే తాము ఖండించామన్నారు. హైదరాబాద్‌లో కెమికల్ ఫ్యాక్టరీ వ్యర్థాలను మూసీ నదిలోకి వదలడం వల్లనే కలుషితం అవుతోందని తెలిపారు. 15 వేల కుటుంబాలు మూసీ నదిపై ఉన్నాయని.. వాటిని కూలగొడతామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారన్నారు. ముందు డబుల్ బెడ్ రూం ఇచ్చిన తరువాతనే పేదల ఇళ్లు కూలగొట్టాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
TG News: మా భర్తలతో అలాంటి పనులు చేయిస్తారా.. పోలీసు భార్యల ధర్నా
Jeevan Reddy: ఏఐసీసీ చీఫ్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ..
Read Latest Telangana News And Telugu News