కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Feb 01 , 2024 | 11:39 PM
బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.
గద్వాల న్యూటౌన్/ అలంపూర్ చౌరస్తా, ఫిబ్రవరి 1 : బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ స్పీకర్ చాంబర్‌లో గురువారం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆయనను కలిశారు. పుష్పగుచ్ఛం అందించి హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు.