Mansukh Mandaviya: బర్కత్పుర పీఎఫ్ ఆఫీసుకు కేంద్ర మంత్రి
ABN , Publish Date - Sep 22 , 2024 | 03:51 AM
హైదరాబాద్లోని బర్కత్పురలో ఉన్న పీఎఫ్ కా ర్యాలయాన్ని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం సందర్శించారు.
బర్కత్పుర/రవీంద్రభారతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లోని బర్కత్పురలో ఉన్న పీఎఫ్ కా ర్యాలయాన్ని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం సందర్శించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈపీఎఫ్ తెలంగాణ జోన్లో ఏటా రూ.7,797కోట్ల చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు. యువ ఉద్యోగుల కోసం కేంద్రప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్(ఈఎల్ఐ) పథకాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు.
ఈ పథకం కింద.. మొదటిసారి ఉద్యోగంలో చేరే యువతీయువకులకు ఒక నెల వేతనాన్ని ప్రభుత్వం సబ్సి డీ రూపంలో అందిస్తుందన్నారు. కాగా, రిటైర్డ్ పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించాలని భవిష్యనిధి పెన్షనర్ల వెల్పేర్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు నాగేందర్ తదితరులు ఈ సందర్భంగా కేంద్రమంత్రిని కోరారు.