BRS: వరద బాధితులకు బీఆర్‌ఎస్ భారీ విరాళం... ఒక నెల జీతం మొత్తం..
ABN , Publish Date - Sep 04 , 2024 | 01:15 PM
Telangana: రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం అంతాఇంతా కాదు. భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యవసర వస్తువుల కోసం అల్లాడిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని అందజేయనున్నట్లు మాజీ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.
సిద్దిపేటజిల్లా, సెప్టెంబర్ 4: రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం అంతాఇంతా కాదు. భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యవసర వస్తువుల కోసం అల్లాడిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని అందజేయనున్నట్లు మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao)ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించాని తెలిపారు. ఖమ్మం వరదల కారణంగా చాలా నష్టపోయారన్నారు.
CM Chandrababu: బుడమేరుకు మళ్లీ వరద.. లోకేష్‌కు చంద్రబాబు కీలక ఆదేశాలు..
సిద్దిపేట కౌన్సిలర్‌లు కూడా ఒక నెల జీతం ఇవ్వాలని నిర్ణయించారని మాజీ మంత్రి ప్రకటించారు. ‘‘మానవ సేవయే మాధవ సేవ.. ఆపదలో ఉన్న వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టే ’’ అని చెప్పుకొచ్చారు. ఖమ్మంలో వరదలు వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు. అన్ని రకాల వస్తువులు పూర్తిగా ధ్వంసం అయ్యాయన్నారు. సిద్దిపేట నుంచి సేవలు అందించేందుకు చాలా మంది ముందుకు వచ్చారని తెలిపారు. సిద్దిపేట నుంచి రేపు 6 లారీల్లో సామాన్లు పంపిస్తున్నామని తెలిపారు. సహాయం చేయడంలో ఇంకా ముందుకు రావాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.
AP Highcourt: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ తిరస్కరణ
కాగా... బుధవారం సిద్దిపేట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన మట్టి వినాయకుల పంపిణి కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమర్ నాథ్ సేవా సమితి సేవలు దేశ వ్యాప్తంగా వెళ్లాయని... వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. 13 సంవత్సరాలుగా మంచు కొండల్లో సేవలు అందిస్తున్నారన్నారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు నిలయం సిద్దిపేట అని అన్నారు. ఇప్పుడు ప్రకృతి కోసం మట్టి వినాయకులు పంచుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడాలని అన్నారు. సకల కార్యాలకు విగ్నేశ్వరున్ని మొదటగా పూజిస్తామని.. ఆకర్షణ కన్నా ఆధ్యాత్మిక ముఖ్యమన్నారు. మట్టి గణపతే మహా గణపతి అని తెలిపారు. ప్రకృతి ప్రేమిద్దాం.. మట్టి వినాయకులను పూజిద్దాం అని హరీష్ రావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
AP Highcourt: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ తిరస్కరణ
B.Venkat: కేంద్రం తక్షణమే వరద సాయం అందించాలి
Read Latest Telangana News And Telugu News