Share News

TS News: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన.. ఎమ్మెల్సీ కవిత విమర్శలు

ABN , Publish Date - Mar 05 , 2024 | 03:45 PM

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తిప్పారం గ్రామానికి చెందిన హర్యల వెంకట్ బోధన్ హాస్టల్‌లో జరిగిన సంఘటనలో ఒక విద్యార్థి మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

TS News: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన.. ఎమ్మెల్సీ కవిత విమర్శలు

కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తిప్పారం గ్రామానికి చెందిన హర్యల వెంకట్ బోధన్ హాస్టల్‌లో జరిగిన సంఘటనలో ఒక విద్యార్థి మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత, పట్టింపులేని చర్యలే ఈ దారుణానికి కారణమని అన్నారు. బోధన్ హాస్టల్‌లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు చనిపోయారు. మరో ఎనిమిది మంది విద్యార్థులపై హత్య కేసు నమోదైంది. హాస్టల్‌లో వార్డెన్, వాచ్‌మెన్ కూడా లేకపోవడంతో విద్యార్థుల ఘర్షణను ఆపేవారు లేకుండాపోయారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. కవిత మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై పడి ఏడవడం తప్ప ఈ మూడు నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు చూశాం. ఆ తర్వాత గత మూడు నెలల్లోనే చూశాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు విద్య శాఖకు మంత్రి లేకపోవడం మన దురదృష్టం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రివ్యూ నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన. ఇప్పటికైనా గురుకుల పాఠశాలల్లో వాచ్‌మెన్ లేకపోతే ఒక పోలీస్ కానిస్టేబుల్‌ని నియమించాలని జిల్లా కలెక్టర్‌ను కోరాము. మృతుడి తల్లికి పెన్షన్, సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం, 15 లక్షల నష్టపరిహారం, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.’’ అని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 03:45 PM