Narendra Modi: రామోజీ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది
ABN , Publish Date - Jun 08 , 2024 | 10:03 AM
ప్రముఖ మీడియా ప్రముఖుడు, రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు(ramoji rao) మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మోదీ రామోజీరావుకు నివాళులు ప్రకటించారు.
ప్రముఖ మీడియా ప్రముఖుడు, రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు(ramoji rao) మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మోదీ రామోజీరావుకు నివాళులు ప్రకటించారు. భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆయన సహకారం జర్నలిజం, సినిమా ప్రపంచంలో చెరగని ముద్ర వేసిందన్నారు. రామోజీ అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా మీడియా, వినోద ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు, కొత్త ప్రమాణాలు నెలకొల్పారని వెల్లడించారు. ఈ క్రమంలో రామోజీరావు మృతికి సంతాపం తెలుపుతూ భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని ప్రధాని మోదీ అభివర్ణించారు.
దీంతోపాటు ఆయనతో మాట్లాడటం, ఆయన నుంచి ప్రయోజనం పొందే అవకాశాలు లభించడం నా అదృష్టమని మోదీ అన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. ఆయన మృతి దిగ్భ్రాంతికి గురిచేసినట్లు తెలిపారు. రామోజీరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. జూన్ 5న రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్(hyderabad)లోని స్టార్ ఆసుపత్రిలో చేరారు. ఆ క్రమలోనే ఈరోజు తెల్లవారుజామున 4:50 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో రామోజీ పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు.
ఇవి కూడా చదవండి:
Ramoji Rao: అక్షర శిల్పి రామోజీకి ఘన నివాళి
Narendra Modi: రేపు ఈ సమయంలోనే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. భారీగా భద్రతా ఏర్పాట్లు
Read Latest Telangana News and Telugu News