Medigadda: మేడిగడ్డ బ్యారేజ్‌కు పెరుగుతున్న ప్రాణహిత వరద
ABN , Publish Date - Jun 28 , 2024 | 08:01 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజ్‌కు ప్రాణహిత వరద పెరుగుతోంది. బ్యారేజీలోకి 8800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. బ్యారేజ్ రక్షణ చర్యలో భాగంగా ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాల మేరకు.. గ్రౌటింగ్, సీ సీ బ్లాకుల పునరుద్ధరణ, షీట్ ఫైల్స్ అమరిక పూర్తయ్యింది. గేటు విడిభాగాలను తొలగించేశారు.
జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజ్‌కు ప్రాణహిత వరద పెరుగుతోంది. బ్యారేజీలోకి 8800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. బ్యారేజ్ రక్షణ చర్యలో భాగంగా ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాల మేరకు.. గ్రౌటింగ్, సీ సీ బ్లాకుల పునరుద్ధరణ, షీట్ ఫైల్స్ అమరిక పూర్తయ్యింది. గేటు విడిభాగాలను తొలగించేశారు. మట్టి నమూనాల కోసం డ్రిల్లింగ్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. కాగా.. వరద ఉధృతి పెరుగుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం గేట్లు 85 ఉన్నాయి. వాటిలో 84 గేట్లను ఎత్తి ఉంచారు.
గత నెలలో మేడిగడ్డ బ్యారేజ్‌కి సంబంధించి మంత్రి వర్గ సమావేశం జరిగింది. ప్రాణహితకు వర్షాకాలం వచ్చే వరద తగ్గుముఖం పట్టాక మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన తాత్కాలికంగా రాతికట్ట కట్టి, నదీ ప్రవాహాన్ని లక్ష్మీ పంప్‌హౌ్‌సకు మళ్లించి, అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోయాలని రాష్ట్ర మంత్రివర్గం ఆ సమావేశంలో నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటిని నిల్వ చేసే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్యాబియన్ వాల్ పద్ధతిలో ఇనుప వల మధ్యలో రాళ్లను కూర్చి 2.5 మీటర్ల ఎత్తుతో ఈ కట్టను నిర్మిస్తారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిపోయి, మరమ్మతులు, బ్యారేజీ పునరుద్ధరణ ఇప్పట్లో కుదిరే పని కాకపోవడంతో రాతి గోడ నిర్మాణం నిర్ణయం తీసుకున్నారు.