Money Lender Murder: అప్పు తీర్చమన్నందుకు ఫైనాన్సర్ దారుణ హత్య
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:20 AM
గాంధీనగర్‌లో స్వప్నం సింగ్ అనే ఫైనాన్సర్‌ను అప్పు తీర్చమన్నందుకు నవీన్ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసి తన ఇంట్లోని సంపులో పడేసి పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి గాలిస్తున్నారు

సికింద్రాబాద్‌లోని గాంధీనగర్‌లో ఘటన
పరారీలో నిందితుడు
కవాడిగూడ/ రాంనగర్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ఇచ్చిన అప్పును తీర్చమన్న పాపానికి ఓ ఫైనాన్సర్‌ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి తన ఇంట్లోని సంపులో పడేసి పారిపోయాడో వ్యక్తి. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని గాంధీనగర్‌లో జరిగింది. అల్వాల్ వెంకటాపురానికి చెందిన స్వప్నం సింగ్ (59) వృత్తి రీత్యా ఫైనాన్సర్, పరిచయం ఉన్న వారందరికీ ఆయన పైనాన్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలో గాంధీనగర్‌లో చాయి బండి నిర్వహించే ఒడిసాకు చెందిన నవీన్‌కు ఆయన ఫైనాన్స్ ఇచ్చారు. అయితే నవీన్ తీసుకున్న అప్పును తీర్చకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన స్వప్నం సింగ్ డబ్బు అడిగేందుకు నవీన్ ఇంటికి వెళ్లారు. ఆ రోజు ఇంట్లోనే ఉన్న నవీన్‌ను అప్పు తీర్చాలని స్వప్నం సింగ్ నిలదీసి అడగగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో కోపోద్రిక్తుడైన నవీన్, స్వప్నం సింగ్‌పై కత్తితో పలుమార్లు దాడి చేసి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని తన ఇంట్లోని నీటి సంపులో పడేసి పరారయ్యాడు. స్వప్నంసింగ్ ఇంటికి రాకపోవడంతో భయపడిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా స్వప్నం సింగ్.. నవీన్ ఇంటి వద్ద ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లి చూడగా సంపులో ఆయన మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నవీన్‌ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. కాగా, నిందితుడు నవీన్.. స్వప్నం సింగ్ దగ్గరే కాకుండా పలువురి దగ్గర అప్పులు చేసి బోయిగూడలో ఓ ఇల్లు కొన్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి
No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం
Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ
Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా
Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..
Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం
శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు
కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ
For Telangana News And Telugu News

రేవంత్ ప్రభుత్వంపై మాకు ఆ ఆలోచన లేదు:కిషన్‌రెడ్డి

రైతులకు గుడ్‌న్యూస్.. రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం

తప్పు చేసిన వారిని వదలం.. పొంగులేటి మాస్ వార్నింగ్

రూ. 50 వేలు కాదు.. ఇక నుంచి రూ. 4 లక్షలు ఇస్తారట..

ఆర్.కృష్ణయ్య హెచ్చరిక.. ప్రజాభవన్‌ను హాస్టళ్లుగా మారుస్తాం
