Buddavanam: బుద్ధవనంలో త్వరితంగా కుటీరాల నిర్మాణం
ABN , Publish Date - Aug 24 , 2024 | 03:33 AM
నాగార్జునసాగర్‌లో సుమారు 274 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన బుద్ధవనం ప్రాజెక్టులో ప్రతిపాదించిన పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటక శాఖ నిర్ణయించింది.
బుద్ధవానాన్ని పరిశీలించిన పర్యాటక అధికారులు
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌లో సుమారు 274 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన బుద్ధవనం ప్రాజెక్టులో ప్రతిపాదించిన పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధక్షేత్రంగా గుర్తింపు పొందిన బుద్ధవనాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిద్దిడానికి ప్రతిపాదించిన బౌద్ద కుటీరాలు, మహాస్తూపం నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. బుద్ధవనం ప్రాజెక్టు మెంటార్‌గా నూతనంగా నియమితులైన సి.ఆంజనేయరెడ్డితో కలిసి పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణీప్రసాద్, పర్యాటక శాఖ డైరెక్టర్ ఇలా త్రిపాఠి, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకా్‌షరెడ్డి బుద్ధవనాన్ని పరిశీలించారు.