సింగరేణి భూ సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టాలి
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:12 PM
జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో భూములకు సంబంధించి వచ్చిన దరఖా స్తులపై రెవెన్యూ రికార్డులను పరిశీలించి క్షేత్ర స్థాయిలో విచార ణ జరిపిన అనంతరం సత్వరమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలకలెక్టరేట్, మార్చి29(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో భూములకు సంబంధించి వచ్చిన దరఖా స్తులపై రెవెన్యూ రికార్డులను పరిశీలించి క్షేత్ర స్థాయిలో విచార ణ జరిపిన అనంతరం సత్వరమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాల యంలో బెల్లంపల్లి ఆర్డీవో హరిక్రిష్ణ, సింగరేణి శ్రీరాంపూర్, మం దమర్రి ఏరియాల జీఎంలు జనరల్ మేనేజర్ శ్రీనివాస్, దేవేం దర్‌లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం ద్వారా మండల, సబ్ డివిజన్ జిల్లా స్థాయిల్లో, సింగరేణి ప్రాంతంలో వచ్చే భూ సంబందిత ధరఖాస్తులపై రెవెన్యూ అధికారులు రి కార్డులను పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించా రు. సింగరేణి ఓ పెన్‌కాస్టు ప్రాజెక్టులోజైపూర్ మండలం గుతె ్తదారిపల్లె గ్రామంలో భూములు, ఇండ్లు కోల్పోతున్న బాధితు లకు నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈకార్యక్రమంలో సీనియర్ ఎస్టేట్ ఆఫీసర్ నవనీత, కలెక్టరేట్ ఎసెక్షన్ సూపరింటెండెంట్ సంతోష్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.