ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:17 PM
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం పేట జిల్లా కేంద్రంతో పాటు, దామరగిద్ద మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

నారాయణపేట/మక్తల్/కోస్గి రూరల్/దామరగిద్ద, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం పేట జిల్లా కేంద్రంతో పాటు, దామరగిద్ద మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పళ్ల వీధిలో పార్టీ సీనియర్ నాయకుడు కే.ఓంప్రకాష్ ముదిరాజ్ టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అ నంతరం సరాఫ్‌బజార్ బాలాజీ మందిర్‌లో పూజలు నిర్వహించి, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓంప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సహకారంతో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, జహీర్‌అహ్మద్, యాబణ్ణచౌదరి, వద్ది నారాయణ, పెంటయ్య, రాములు, కిష్టప్ప, లక్ష్మప్ప, సత్యనారాయణ తదితరులున్నారు.
అదేవిధంగా, మక్తల్ పట్టణంలో టీడీపీ నాయకుడు మధుసూదన్‌రెడ్డి ఇంట్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. నాయకులు ఆంజనేయులు, అక్షయ్ కుమార్‌రెడ్డి, వెంకటేష్, గోపి, ఆశప్ప, నబి, శంకర్, నారాయణ పాల్గొన్నారు.
కోస్గి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సామల వెంకటప్రసాద్, కుమ్మరి అంజిలయ్య, డీకే.రాములు, అమృతరెడ్డి, మల్లేశం, నారాయణ, సాయిలు, వెంకట య్య, బిచ్చప్ప, అనంతయ్య తదితరులున్నారు.
దామరగిద్దలో ఎన్టీ రామారావు విగ్రహానికి టీ డీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. పార్ల మెంటు అడ్‌హక్ కమిటీ సభ్యుడు రాములుయాదవ్, నాయకులు మొగులప్ప, తిమ్మారెడ్డి, వీరన్నగౌడ్, బుగ్గప్ప, నందు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.