పేదల సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వం
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:13 PM
ప్రభు త్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం అ భ్యున్నతికి పాటుపడుతోందని ఎమ్మెల్యే కూచ కుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

- లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కూచకుళ్ల
తాడూరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : ప్రభు త్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం అ భ్యున్నతికి పాటుపడుతోందని ఎమ్మెల్యే కూచ కుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలకు చెందిన 31మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో అందించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద వర్గాల పక్షాన ఉంటుందని అన్నారు. వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలతో పాటు సంక్షేమ పథకా లను అందజేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బందితో పాటు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వినోద్‌కుమార్, మండల అధ్యక్షుడు రమేష్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.