Share News

ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:11 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వ హ యాంలో మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు.

ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

జన్నారం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వ హ యాంలో మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. మం డల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, పం చాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్య లేకుండా అధికా రులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకే అందేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం పొనకల్‌ గ్రామంలో న్యాక్‌ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్‌లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనం తరం మండలంలోని రోటిగూడ, ఆదివాసీ గ్రామాలైన అల్లినగ ర్‌, దొంగపల్లి గ్రామాల్లో పర్యటించారు. అక్కడి ఆదివాసీలు ఎ మ్మెల్యేకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వారి సమస్యలను అడి గి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకా లను అర్హులకు అందిస్తామన్నారు. అనంతరం మహ్మదాబాద్‌, పొనకల్‌ గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన చలి వేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజమనోహ ర్‌రెడ్డి, ఎంపీడీవో ఉమర్‌ షరీఫ్‌, కాంగ్రెస్‌ మండల అద్యక్షుడు ముజఫర్‌ ఆలీ, నాయకులు పసివుల్లా, అల్లం రవి, సుభాష్‌రెడ్డి, సయ్యద్‌ ఇసాక్‌, దుమ్మల రమేష్‌, ప్రవీణ్‌, ముత్యం సతీష్‌తో పాటు మండల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 11:11 PM