Share News

మాది రైతు ప్రభుత్వం

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:13 PM

మాది రైతుల కోసం నిరంతరం పోరాడి, వారి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూధన్‌రెడ్డి అన్నారు.

మాది రైతు ప్రభుత్వం
స్ర్పింక్లర్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే జీ మధుసూధన్‌రెడ్డి

- ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి

- రైతులకు స్ర్పింక్లర్లు పంపిణీ

భూత్పూర్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : మాది రైతుల కోసం నిరంతరం పోరాడి, వారి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూధన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయం కోసం తుంపర సేద్యం చేయడానికి గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులకు స్ర్పింక్లర్లు మంజూరు కాగా, శనివారం మండల కేంద్రంలోని మునిరంగ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో ఉన్న ప్రభుత్వం మాదిరి మాయ మాటలు చెప్పి కాలం వెళ్ల దీసుకొనే ప్రభుత్వం కాదని, రైతుల సంక్షేమం కోసం నిరతరం పోరాడుతున్న ప్రభుత్వమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 54 మంది రైతులకు 75 శాతం సబ్సిడీపై స్ర్పింక్లర్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా నియోజవర్గం మొత్తంలో 540 మంది రైతులకు సబ్సిడీపై స్ర్పింక్లర్లు పంపినీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ హర్యానాయక్‌, మాధవరెడ్డి, బోరింగ్‌ నర్సిములు, శివరాములు, పవన్‌కుమార్‌, మశ్చంధర్‌ పాల్గొన్నారు.

ఎల్‌వోసీ అందజేత

మూసాపేట : మండలంలోని చక్రపూర్‌ గ్రామానికి చెందిన జగదీష్‌ కుమారుడు శివప్రసాద్‌ న్యూరో సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని నీమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, మంజూరైన రూ.2.50 లక్షల ఎల్‌వోసీని శనివారం ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

Updated Date - Mar 29 , 2025 | 11:13 PM