Share News

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:15 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
జిల్లా కేంద్రంలో టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న నాయకులు

కందనూలు/ అచ్చంపేట టౌన్‌/ ఉప్పునుంతల/ కొల్లాపూర్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించి ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో మెయిన్‌ రో డ్డులో దివంగత నందమూరి తార క రామారావు చిత్రపటానికి పూల మాలలు నివాళి అర్పించారు. కేక్‌ కట్‌ చేసి పం పిణీ చేశారు. టీడీపీ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి కొప్పుల రమేష్‌ మాట్లాడుతూ ప్రజలు తెలుగుదేశం పార్టీని తె లంగాణలో ఆదరిస్తున్నారని, రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రాము, పట్టణ ఉపాధ్యక్షుడు శ్రీరామ్‌, నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి, సుబ్బారెడ్డి, ఎండి.సుల్తాన్‌ పాల్గొన్నారు.

ఫ అచ్చంపేటలో టీడీపీ నాయకుడు సత్య నారాయణ ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉప్పు నుంతల మండల పరిధిలోని లత్తీపూర్‌ గ్రామం స్టేజీ వద్ద టీడీపీ మండల అధ్యక్షుడు కాశన్న ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

కొల్లాపూర్‌ పట్టణంలో ఎన్టీఆర్‌ చౌరస్తాలో మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఉరి సుధా కర్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమం లో మాజీ సర్పంచ్‌ చంద్రశేఖర్‌ శెట్టి, పార్టీ నాయకులు గజ్జి లింగం, అస్నొద్దీన్‌, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.

కొల్లాపూర్‌ మండలం రామాపురం గ్రామం లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని టీడీపీ మండల నాయకుడు ఆకునమోని చంద్రయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. నాయకులు సుధాకర్‌, అస్ముద్దీన్‌, లింగం, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 11:15 PM