మేడారం వస్తున్నా..
ABN , Publish Date - Jan 27 , 2024 | 10:23 PM
మేడారం వనదేవతల మహా జాతరకు హాజరవుతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 23న మేడారం వచ్చి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటానని తెలిపారు. వనదేవ తల వడ్డెలు(పూజారులు) సిద్ధబోయిన జగ్గారావు, కాక సారయ్య, కాక కిరణ్, చంద రఘుపతిరావు సీఎంను శనివారం కలిశారు.

23న జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకుంటా..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రాష్ట్ర సచివాలయంలో మహాజాతర పోస్టర్ ఆవిష్కరణ
సీఎంను సన్మానించిన పూజారులు
సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం సమర్పణ
మేడారాన్ని డిప్యూటీ కమిషనర్ పరిధికి అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి
ములుగు, జనవరి 27: మేడారం వనదేవతల మహా జాతరకు హాజరవుతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 23న మేడారం వచ్చి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటానని తెలిపారు. వనదేవ తల వడ్డెలు(పూజారులు) సిద్ధబోయిన జగ్గారావు, కాక సారయ్య, కాక కిరణ్, చంద రఘుపతిరావు సీఎంను శనివారం కలిశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, దేవాదాయ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమక్షం లో జాతర పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన్ను పూజారులు శాలువాతో సన్మానిం చారు. వనదేవతల పసుపు కుంకుమ, ప్రసాదాన్ని అంద జేశారు. జాతరకు రావాలని ఆహ్వానించారు. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జాతర జరుగుతుండగా వనదేవతలంతా గద్దెలపై కొలువున్న 23న మొక్కుల నాడు మేడారం వచ్చి దర్శనం చేసుకుంటానని రేవం త్‌రెడ్డి వారికి తెలిపారు.
వారసత్వ వాటా సమస్యను తీర్చాలి..
మేడారం వడ్డెలు(పూజారుల) సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి పూజారులు వినతిపత్రం సమర్పిం చారు. అందులో పలు అంశాలను పేర్కొన్నారు. ప్రధా నంగా వారసత్వ వాటా విషయంలో న్యాయ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశ అత్యున్నత న్యాయ స్థానం తీర్పులు, హిందూ వారసత్వ చట్టాన్ని అనుసరిం చి పూజారుల కొడుకులకే వారసత్వ వాటా చెందేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. పాలనా పరంగా మేడారం జాతర ప్రస్తుతం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పరిధిలో ఉందని, డిప్యూటీ కమి షనర్ స్థాయికి అప్‌గ్రేడ్ చేసి జాతర ప్రాంగణంలో శా శ్వత ఈవో కార్యాలయాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
ధార్మిక భవనానికి వనదేవతల పేరు పెట్టాలి
వరంగల్‌లో గతంలో పూజారులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిలో రూ.కోటి మేడారం వాటా ధనంతో నిర్మించిన ధార్మిక భవనానికి సమ్మక్క, సారల మ్మల పేరు పెట్టాలని సీఎంను పూజారులు కోరారు. భవనాన్ని మేడారం పరిధిలో ఉంచుతూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. సమ్మక్క, సారలమ్మలను గద్దెకు చేర్చే సమయంలో మూడంచెల భద్రత కల్పించాలని, ఆదివా సీ సంప్రదాయాలపై అవగాహన, కుల సంఘాలతో సత్సంబంధాలు కలిగిన ఐపీఎస్ అధికారులను నియ మించాలని కోరారు. మేడారం జాతరలో ప్రధానమైన చిలుకలగుట్ట పవిత్రతను పరిరక్షించేందుకు సుమారు 50 ఎకరాల గుట్టను కొందరు పూజారుల పేరున ఆర్‌వో ఎఫ్‌ఆర్ పట్టా చేశారని, దీనిని వనదేవతల పేరున బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పగిడిద్దరాజు, గోవిందరాజులను మేడారం తీసుకొచ్చే క్రమంలో పూజా రులకు డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో రోప్ పార్టీలతో రక్షణ కల్పించాలని, దారి మధ్యలో వారికి సదుపాయాలు సమకూర్చాలని అన్నారు.
మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన శాశ్వత వసతు లు కల్పించాలని, ప్రతిసారీ పనులకు ఆటంకం కలిగిస్తు న్న అటవీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పూజారులు విజ్ఞ ప్తి చేశారు. మేడారం జాతరకు అనుబంధ దేవతలైన పగిడిద్దరాజు, గోవిందరాజులు ఉండే పూనుగొండ్ల, కొం డాయిని మాత్రమే దేవాదాయ గుర్తింపును ఇచ్చిందని, బయ్యక్కపేట, దొడ్ల గ్రామాలలోని ఆలయాలను కూడా ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు.
సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజారుల కోసం దేవాదాయ ద్వారా శాశ్వత గదులను కేటాయించాలన్నారు. దేవతలను గద్దెలపైకి తీసుకొచ్చే క్రమంలో ఆదివాసీ కుల సంఘాలు భాగస్వామ్యమ వుతాయని, వారికి కూడా వసతి షెడ్డును నిర్మించి ఇవ్వాలని కోరారు. జాతర నిర్వహణకు కేటాయించే నిధులలో సింహభాగం దేవస్థానానికి మంజూరు చేయాలన్నారు. పుణ్య స్నానాల సమయంలో జంపన్నవాగులో ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో వనదేవతల గద్దెలపై పోలీసులు, మీడియా ప్రతినిధులు డ్రోన్ కెమెరాలు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జాతరకు 15రోజుల ముందే బెల్లం, మద్యం, కొబ్బరి కాయల దుకాణాలను కేటాయించాలని కోరారు. పూజారులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. డోలీలను(డోలు వాయిద్య కళాకారులు) దేవాదాయ శాఖ ఆఽధ్వర్యంలో నియమించాలని కోరారు.
వనదేవతలకు మొక్కులు
మేడారం, జనవరి 27: సమ్మక్క, సారలమ్మలను ధర్శించుకోవడానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజుల పాటు మహాజాతర జరుగనున్న నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వివిధ రాష్ర్టాల నుంచి వచ్చారు. ముం దుగా జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి, కల్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించారు. అనంతరం గద్దెలకు చేరుకుని మొక్కులు చెల్లించారు. సుమారు 30 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
పనులు పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
మహాజాతరలో భక్తుల సౌక ర్యార్థం చేపట్టిన అభివృద్ధి పను ల పరోగతిని ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. జాతర సమీపిస్తున్న నేపథ్యం లో నెల చివరికల్లా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హరిత హోటల్ పరిసర ప్రాంగణం, క్యూలైన్లు, వీధి దీపాల ఏర్పాట్ల పనులను పరిశీలించారు. ఆయా పనుల నిర్వహణకు జోనల్ వారీగా బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆమె వెంట ఈవో రాజేంద్రం, పీఆర్ ఈఈ అజయ్‌కుమార్, డీపీవో వెంకయ్య, తహసీల్దార్ రవీందర్, పలు శాఖల అధికారులు ఉన్నారు.