Warangal: మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన నిర్ణయం
ABN , Publish Date - Feb 03 , 2024 | 09:59 AM
వరంగల్ జిల్లా: బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 10న కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
వరంగల్ జిల్లా: బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 10న కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాగా తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రిగా రాజయ్య పనిచేశారు. ఆయన రాజీనామాతో వరంగల్‌లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
ఈ సందర్భంగా రాజయ్య శనివారం ఆయన స్టేషన్ ఘనపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆరు నెలల నుంచి మానసిక వేదనకు గురవుతున్నానని, ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినా... 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానం చేసినా... విధేయుడిగా ఉన్నానన్నారు. ముఖ్య నేతలు ప్రజలతీర్పు అంగీకరించకపోవడం కలిచి వేసిందని, క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ కరువైందన్నారు. స్థానిక, రాష్ట్ర నాయకత్వం లోపంతో కార్యకర్తలు, నాయకులు కష్టాల పాలవుతున్నారని, ప్రజా సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయే పరిస్థితి ఈరోజుకీ లేదన్నారు. మాదిగ ఆస్థిత్వంపై దెబ్బ కొట్టేలా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని తాటికొండ రాజయ్య ఆరోపించారు.