హై స్పీడ్‌లో అమరావతి పనులు..

ABN, Publish Date - Dec 22 , 2024 | 08:13 AM

అమరావతి: రాజధాని అమరావతి పనులు స్పీడ్ అందుకుంటున్నాయి.. అమరావతి నిర్మాణాలు టెండర్లను పిలిచే ప్రక్రియ ప్రారంభమైంది. రుణం అందుబాటులోకి రావడంతో పాటు, గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన పనులకు గతంలో పిలిచిన టెండర్లలో ఉన్న కాంట్రాక్టు సంస్థలకు కాంట్రాక్టును రద్దు చేసే ప్రక్రియ కూడా పూర్తి చేశారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

అమరావతి: రాజధాని అమరావతి పనులు స్పీడ్ అందుకుంటున్నాయి.. ఇప్పటికే రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు, జర్మనీకి చెందిన KFW, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో మొత్తం కలిపి 31వేల కోట్ల రూపాయల రుణం అందుబాటులోకి రావడంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. హడ్కో నిధులతో నిర్మించే పనులకు టెండర్లను పిలవడం ప్రారంభించారు.


రాజధాని అమరావతి నిర్మాణాలు టెండర్లను పిలిచే ప్రక్రియ ప్రారంభమైంది. రుణం అందుబాటులోకి రావడంతో పాటు, గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన పనులకు గతంలో పిలిచిన టెండర్లలో ఉన్న కాంట్రాక్టు సంస్థలకు కాంట్రాక్టును రద్దు చేసే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. గతంలో రాజధాని అమరావతిలోని సీ.ఆర్.డి.ఎ, నాలుగో తరగతి ఉద్యోగుల భవన సముదాయం, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాస భవనాలు, న్యాయమూర్తులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇతర భవనాల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. కొన్ని భవనాల నిర్మాణం 90 శాతం పూర్తి అయ్యింది. అయితే ఈ భవనాల నిర్మాణంలో పాల్గొన్న కాంట్రాక్టు సంస్థలను సీ.ఆర్.డి.ఎ పిలిపించింది. వారితో అధికారులు చర్చలు జరిపారు. గతంలో ఇచ్చిన కాంట్రాక్టులకు సమయం అయిపోవడంతో, ఆ టెండర్లను రద్దు చేశారు. ఇందు కోసం కాంట్రాక్టు సంస్థలతో చర్చలు జరిపి అంగీకారానికి వచ్చారు.

Updated at - Dec 22 , 2024 | 08:14 AM