Share News

Harish Rao: కాళేశ్వరంపై ప్రభుత్వం చిన్నచూపు

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:27 AM

కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

Harish Rao: కాళేశ్వరంపై ప్రభుత్వం చిన్నచూపు

  • కుంగిన పిల్లర్‌కు మరమ్మతు చేసి నీటిని పంపింగ్‌ చేయొచ్చు: హరీశ్‌రావు

చిన్నకోడూరు/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం శివారులోని రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ ఎడమ కాలువ కింద ఉన్న ఎల్‌ఎ్‌సఎం-5 కాలువ ద్వారా కమ్మర్లపల్లి జాలు చెరువులోకి నీటిని వదిలారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు గోదావరి జలాలకు పూజ చేసి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఉద్దేశ్యపూర్వకంగానే భూసేకరణకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చే యడం లేదన్నారు.


ఈ ప్రభుత్వం పగతో పనిచేస్తోందని, అలాకాకుండా ప్రజలు, రైతుల కోసం ప్రేమతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కుంగిన కాళేశ్వరం పిల్లర్లకు తొందరగా మరమ్మతు చేప్తే వేసవిలోనూ నీటిని పంపింగ్‌ చేయవచ్చన్నారు. ఒక దశాబ్దంలో సాధించిన వృద్థిని.. ఏడాది పాలనలో దెబ్బతీశారని హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లపాలనలో (కోవిడ్‌ మినహా) తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ వార్షిక వృద్ధిరేటు 25.62ు సాధిస్తే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 2024-25లో ఈ శాఖ ఆదాయంలో 1.93ు తగ్గిందని ఆదివారం ఎక్స్‌ ఖాతాలో ఆయన పోస్ట్‌ చేశారు.

Updated Date - Apr 07 , 2025 | 05:27 AM