బుడమేరును మింగేసిన వైసీపీ నాయకులు..

ABN, Publish Date - Sep 06 , 2024 | 09:57 AM

విజయవాడ: వాగులు, వంకలు ఆక్రమణలకు గురైతే ప్రకృతి కన్నెర్ర చేస్తుందని మరోసారి రుజువైంది. అయితే ఈ పాపం మొత్తం వైసీపీ నేతలదే. గతంలో బుడమేరు కాల్వగట్ల వెంట అక్కడడక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ప్రజలు నివసించేవారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి వైసీపీ నేతలు గద్దల్లా వాలిపోయారు.

విజయవాడ: వాగులు, వంకలు ఆక్రమణలకు గురైతే ప్రకృతి కన్నెర్ర చేస్తుందని మరోసారి రుజువైంది. అయితే ఈ పాపం మొత్తం వైసీపీ నేతలదే. గతంలో బుడమేరు కాల్వగట్ల వెంట అక్కడక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ప్రజలు నివసించేవారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి వైసీపీ నేతలు గద్దల్లా వాలిపోయారు. బుడమేరు కట్టకు ఆనుకుని ఉన్న నివాసాలతోపాటు నిదానంగా బుడమేరు కాల్వనే ఆక్రమించేశారు. దర్జాగా ప్లాట్లు వేసుకుని అందినకాడకి అమ్మేశారు. ఈ వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు కూడా ఇచ్చింది. ఇరిగేషన్ అధికారులు వచ్చి హడావుడి చేసి వెళ్లిపోవడమే తప్ప.. పూర్తిగా ఆక్రమణలపై నియంత్రణ చర్యలు చేపట్టలేదు.


ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నాయకులు కలిసి బుడమేరును దాదాపుగా మింగేశారు. ఇలా బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడం, అంత నీటి ప్రవాహం నేరుగా వెళ్లేమార్గం లేకపోవడంతో ఒక్కసారిగా గండ్లు పడి ఊరుమీదకు వచ్చాయి. గట్టులను కూడా గత ఐదేళ్లలో ఎక్కడా కనీసం మరమ్మతులు చేయకపోవడం, బలహీనపడిన కట్టలను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తప్పు చేసింది జగన్, వైసీపీ నేతలు.. కానీ శిక్ష అనుభవించింది మాత్రం పేద ప్రజలు.


ఈ వార్తలు కూడా చదవండి..

సజ్జలను అరెస్టు చేస్తే.. అన్నీ బయటకొస్తాయి ..

టీడీపీ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..

YCP: అధ్యక్ష బాధ్యతలా.. మాకొద్దు బాబోయ్‌..

కౌశిక్ రెడ్డికి బల్మూరి వెంకట్ కౌంటర్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 06 , 2024 | 09:58 AM