తిప్పేసిన నూర్ మెరిసిన రచిన్
ABN , Publish Date - Mar 24 , 2025 | 05:17 AM
ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) అర్ధ శతకాలతోపాటు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్పిన్నర్ నూర్ అహ్మద్...

గైక్వాడ్ అర్ధ శతకం
4 వికెట్లతో చెన్నై గెలుపు
పోరాడి ఓడిన ముంబై
విఘ్నే్‌షకు 3 వికెట్లు
చెన్నై: ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) అర్ధ శతకాలతోపాటు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్పిన్నర్ నూర్ అహ్మద్ (4/18) మాయాజాలంతో.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎ్‌సకే) బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై గెలిచింది. దీంతో లీగ్‌లో తొలి మ్యాచ్‌లో ఓడే సంప్రదాయాన్ని ముంబై కొనసాగించింది. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ (31), సూర్యకుమార్ యాదవ్ (29), దీపక్ చాహర్ (28 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఖలీద్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో చెన్నై 19.1 ఓవర్లలో 158/6 స్కోరు చేసి నెగ్గింది. స్పిన్నర్ విఘ్నేష్ పుతూర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆంధ్ర పేసర్ సత్యనారాయణ రాజు, కేరళ స్పిన్నర్ విఘ్నేష్ లీగ్‌లో అరంగేట్రం చేశారు.
రచిన్ తుదికంటా..: ఛేదనలో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (2)ని దీపక్ రెండో ఓవర్‌లోనే అవుట్ చేశాడు. కానీ, మరో ఓపెనర్ రచిన్‌కు జత కలసిన కెప్టెన్ రుతురాజ్ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆరో ఓవర్‌లో శాంట్నర్ బౌలింగ్‌లో రుతురాజ్ 6,4,4 బాదడంతో చెన్నై 62/1తో నిలిచింది. ఇదే జోరులో గైక్వాడ్ అర్ధ శతకం పూర్తి చేసుకొన్నాడు. అయితే, విఘ్నేష్ మధ్య ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి చెన్నైకు ఝలక్ ఇచ్చాడు. తను బౌల్ చేసిన తొలి ఓవర్‌లోనే గైక్వాడ్‌ను క్యాచవుట్ చేయడంతో.. రెండో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన శివం దూబే (9), దీపక్ హుడా (3)ను కూడా అవుట్ చేసిన విఘ్నేష్.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. సామ్ కర్రాన్ (4)ను జాక్స్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ రేగింది. ఈ దశలో రచిన్‌కు జత కలసిన జడేజా (17) ఆరో వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు ముంగిట నిలబెట్టాడు. మరోవైపు విఘ్నేష్ బౌలింగ్‌లో సిక్స్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకొన్న రచిన్.. మరో భారీ షాట్ ఆడడంతో లక్ష్యం 12 బంతుల్లో 6 పరుగులకు దిగివచ్చింది. జడ్డూ రనౌట్ అయినా.. రచిన్ సిక్స్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ధోనీ క్రీజులోకి వచ్చినా ఖాతా తెరవలేదు.
దెబ్బకొట్టిన నూర్..: మిస్టరీ స్పిన్నర్ నూర్ మిడిలార్డర్ వెన్నువిరిచినా.. డెత్ ఓవర్లలో దీపక్ మెరుపులతో ముంబై గౌరవప్రద స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైను ఖలీల్ వణికించాడు. తన వరుస ఓవర్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ (0), ర్యాన్ రికెల్టన్ (13)ను పెవిలియన్ చేర్చాడు. విల్ జాక్స్ (11)ను అశ్విన్ క్యాచవుట్ చేయడంతో పవర్‌ప్లేలోనే మూడు టాపార్డర్ వికెట్లు చేజార్చుకొన్న ఎంఐ 36/3తో కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో తాత్కాలిక కెప్టెన్ సూర్య, తిలక్.. నాలుగో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను బౌండ్రీలకు తరలించిన తిలక్ జోరు చూపారు. సూర్య కూడా సిక్స్ బాదడంతో పవర్‌ప్లేను ముంబై 52/3తో ముగించింది. అయితే, మధ్య ఓవర్లలో స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగడంతో వీరిద్దరూ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ స్కోరు బోర్డును నడిపించారు. అయితే, నూర్ తన వరుస ఓవర్లలో సెటిల్డ్ బ్యాటర్లను అవుట్ చేసి గట్టిదెబ్బ కొట్టాడు. 11వ ఓవర్‌లో నూర్ బౌలింగ్‌లో సూర్య స్టంపౌట్ కాగా.. 13వ ఓవర్‌లో రాబిన్ మిన్జ్ (3), తిలక్‌లను నూర్ పెవిలియన్ చేర్చాడు. అప్పటికి ముంబై స్కోరు వంద మార్క్ కూడా దాటలేదు. ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్న నమన్ ధిర్ (17)ను కూడా నూర్ బౌల్డ్ చేయడంతో ముంబై కనీసం పోరాడగలిగే స్కోరైనా చేస్తుందా? అనే అనుమానం కలిగింది. శాంట్నర్ (11)ను ఎలీస్ అవుట్ చేసినా.. చివర్లో బ్యాట్‌ను ఝుళిపించిన దీపక్ జట్టు స్కోరును 150 మార్క్ దాటించాడు.
స్కోరుబోర్డు
ముంబై: రోహిత్ (సి) శివమ్ దూబే (బి) ఖలీల్ 0, రికెల్టన్ (బి) ఖలీల్ 13, విల్ జాక్స్ (సి) శివమ్ (బి) అశ్విన్ 11, సూర్యకుమార్ (స్టంప్డ్) ధోనీ (బి) నూర్ 29, తిలక్ (ఎల్బీ) నూర్ 31, రాబిన్ మిన్జ్ (సి) జడేజా (బి) నూర్ 3, నమన్ ధిర్ (బి) నూర్ 17, శాంట్నర్ (ఎల్బీ) ఎలిస్ 11, దీపక్ చాహర్ (నాటౌట్) 28, బౌల్ట్ (సి) రుతురాజ్ (బి) ఖలీల్ 1, సత్యనారాయణ రాజు (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 155/9; వికెట్ల పతనం: 1-0, 2-21, 3-36, 4-87, 5-95, 6-96, 7-118, 8-128, 9-141; బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4-0-29-3, సామ్ కర్రాన్ 1-0-13-0, నాథన్ ఎలిస్ 4-0-38-1, అశ్విన్ 4-0-31-1, జడేజా 3-0-21-0, నూర్ అహ్మద్ 4-0-18-4.
చెన్నై: రచిన్ రవీంద్ర (నాటౌట్) 65, రాహుల్ త్రిపాఠి (సి) రికెల్టన్ (బి) దీపక్ చాహర్ 2, రుతురాజ్ (సి) జాక్స్ (బి) విఘ్నేశ్ 53, శివమ్ దూబే (సి) తిలక్ (బి) విఘ్నేశ్ 9, దీపక్ హుడా (సి) రాజు (బి) విఘ్నేశ్ 3, సామ్ కర్రాన్ (బి) జాక్స్ 4, జడేజా (రనౌట్) 17, ధోనీ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 19.1 ఓవర్లలో 158/6; వికెట్ల పతనం: 1-11, 2-78, 3-95, 4-107, 5-116, 6-152; బౌలింగ్: బౌల్ట్ 3-0-27-0, దీపక్ చాహర్ 2-0-18-1, సత్యనారాయణ రాజు 1-0-13-0, శాంట్నర్ 2.1-0-24-0, విల్ జాక్స్ 4-0-32-1, విఘ్నేశ్ పుతూర్ 4-0-32-3, నమన్ ధిర్ 3-0-12-0.
13
ఐపీఎల్‌లో ఆరంభ మ్యాచ్‌ను ఓడడం ముంబై ఇండియన్స్‌కిది వరుసగా 13వ సారి. ముంబై చివరిగా తమ తొలి మ్యాచ్‌ను 2012లో గెలిచింది.
ఇవీ చదవండి:
రోహిత్ చెత్త రికార్డు.. 18వ సారి..
సెంచరీకి అతడే కారణం.. ఒక్క మాటతో..: ఇషాన్
సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్‌హెచ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి