విశాఖలో ఐపీఎల్ సమరం
ABN , Publish Date - Mar 24 , 2025 | 05:13 AM
కెప్టెన్లు మారారు.. జట్లలో కూడా భారీ ప్రక్షాళన జరిగింది. ఈనేపథ్యంలో తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఈ ఐపీఎల్‌లో ఘనమైన బోణీ చేయాలని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్...

నేడు లఖ్‌నవూ X ఢిల్లీ
రా.7.30 నుంచి
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): కెప్టెన్లు మారారు.. జట్లలో కూడా భారీ ప్రక్షాళన జరిగింది. ఈనేపథ్యంలో తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఈ ఐపీఎల్‌లో ఘనమైన బోణీ చేయాలని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నాయి. సోమవారం ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో రిషభ్ పంత్ సారథ్యంలో లఖ్‌నవూ, అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ తలపడనున్నాయి. విశాఖ స్టేడియాన్ని హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు ఢిల్లీకి ఆడిన పంత్..లఖ్‌నవూకు మారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక గత సీజన్‌లో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఢిల్లీ తరపున కేవలం ఆటగాడిగా బరిలో దిగుతున్నాడు. అంతేకాదు..రెండు జట్లూ సమూల ప్రక్షాలనతో ఐపీఎల్‌కు సిద్ధమయ్యాయి.
కొత్త ఫ్లడ్‌లైట్లతో స్టేడియం:
ఆధునికీకరణలో భాగంగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రూ. 8 కోట్లతో హాలోజన్ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు.
ఇవీ చదవండి:
రోహిత్ చెత్త రికార్డు.. 18వ సారి..
సెంచరీకి అతడే కారణం.. ఒక్క మాటతో..: ఇషాన్
సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్‌హెచ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి