నాగార్జున సాగర్ 6 గేట్లు ఎత్తివేత

ABN, Publish Date - Aug 05 , 2024 | 02:27 PM

ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆరు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో రెండు లక్షల క్యూసెక్ల నీరు కిందకు విడుదల చేయనున్నారు. జులై 25వ తేదీన శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి భారీగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం వచ్చి చేరింది.

ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆరు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో రెండు లక్షల క్యూసెక్ల నీరు కిందకు విడుదల చేయనున్నారు. జులై 25వ తేదీన శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి భారీగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం వచ్చి చేరింది. అదీకూడా ఆగస్ట్ 5వ తేదీ నాటికి అంటే నేటి వరకు నాగార్జున ప్రాజెక్ట్‌కు భారీగా నీరు వచ్చింది. దీంతో ప్రాజెక్ట్ నుంచి నీటిని కిందకి అధికారులు విడుదల చేశారు.


అయితే శ్రీశైలం నుంచి నీటి ప్రవాహం పెరిగితే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని గేట్లు ఎత్తివేసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఇక గత ఏడాది వర్షపు నీటితో ప్రాజెక్ట్ నిండ లేదు. దీంతో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల కావడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు కృష్ణానది ప్రవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఈ సందర్భంగా అధికారులు అప్రమత్తం చేశారు.

Read More National News and Latest Telugu News

Updated at - Aug 05 , 2024 | 02:27 PM