IPL 2025, GT vs MI: గుజరాత్ vs ముంబై.. రెండు జట్లలోనూ బలమైన ఆటగాళ్లు వీరే
ABN , Publish Date - Mar 29 , 2025 | 06:58 PM
ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. తమ తొలి మ్యాచ్‌ల్లో ఓటములు చవి చూసిన గుజరాత్, ముంబై టీమ్‌లు ఈ రోజు తొలి విజయం అందుకునేందుకు తహతహలాడుతున్నాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌తో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ జట్లు టాప్ క్లాస్ ప్లేయర్స్‌తో బరిలోకి దిగుతున్నాయి.

ఐపీఎల్ (IPL 2025)లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. తమ తొలి మ్యాచ్‌ల్లో ఓటములు చవి చూసిన గుజరాత్, ముంబై టీమ్‌లు (GT vs MI) ఈ రోజు తొలి విజయం అందుకునేందుకు తహతహలాడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలుపు రుచి చూడాలని ఇరు జట్లు పంతంతో ఉన్నాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌తో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ జట్లు టాప్ క్లాస్ ప్లేయర్స్‌తో బరిలోకి దిగుతున్నాయి.
ముంబై ఇండియన్స్ జట్టులోని జాకబ్స్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ రూపంలో మంచి హార్డ్ హిట్టర్లు ముంబై టీమ్‌లో ఉన్నారు. అలాగే ట్రెంట్ బౌలర్, విఘ్నేష్ పుత్తుర్ వంటి ప్రతిభ గల బౌలర్లు ఉన్నారు. అయితే బుమ్రా లేని లోటు మాత్రం కనబడుతోంది. ఇక, గుజరాత్ టీమ్‌లో శుభ్‌మన్ గిల్, అర్షద్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, జాస్ బట్లర్ వంటి బ్యాటర్లు ఉన్నారు. అయితే బౌలింగ్‌లో గుజరాత్ టీమ్ కాస్త బలహీనంగా కనబడుతోంది. తొలి మ్యాచ్‌లో రషీద్ ఖాన్, రబాడా, షిరాజ్ కాస్త భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
ఈ మ్యాచ్ గుజరాత్ స్వంత మైదానంలో జరుగుతోంది కాబట్టి ముంబై కంటే జీటీకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే రోహిత్, సూర్యకుమార్ యాదవ్ వంటి హిట్టర్లను అడ్డుకోవడంపైనే గుజరాత్ గెలుపు ఆధారపడి ఉంది. గుజరాత్‌లో చెప్పుకోదగ్గ హిట్టర్లు లేరనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లలో ఏ టీమ్ తొలి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Sehwag joke on MS Dhoni: ధోనీని అంత మాట అన్నాడేంటి.. 9వ స్థానంలో బ్యాటింగ్‌పై సెహ్వాగ్ జోక్
Virat Kohli: ధోనీ ముందే సీఎస్కే బౌలర్‌కు వార్నింగ్.. విరాట్ కోహ్లీ ఎలా సీరియస్ అయ్యాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..