అధికారుల అత్యుత్సాహం.. రైతుల ఆగ్రహం

ABN, Publish Date - Mar 29 , 2025 | 04:05 PM

Suryapet Farmers Anger: సూర్యాపేటలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ కోసం వడ్లు తీయాలంటూ రైతులకు అధికారులు హుకుం జారీ చేశారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

సూర్యాపేట, మార్చి 29: జిల్లా నేరుడుచర్లలో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) పర్యటన సందర్భంగా అధికారుల అత్యుత్సాహంపై రైతులు మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్ ఏర్పాటు కోసం తమ సొంత పొలంలో వడ్లు ఆరబోసుకున్న రైతులను అధికారులు ఇబ్బందులు పెట్టారు. మంత్రి ఉత్తమ్ హెలీకాఫ్టర్ వస్తోందని వడ్లు తీయాలంటూ రైతులకు అధికారులు హుకుం జారీ చేశారు. ‘మేం చెబితే ఇప్పటికిప్పుడు వడ్లు తీయాలని. మీరు వీడియోలు తీసి ఏం చేస్తారు. ఏం చేయలేరు’ అంటూ రైతులపై ఎమ్మార్వో దౌర్జన్యానికి దిగారు. అధికారుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


అయితే స్థలం యజమాని అనుమతితోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. తనకు తెలియకుండా తన భూమిలో వడ్లు ఆరబెట్టారని యజమాని చెబుతున్నారు. కాగా.. బీఆర్‌ఎస్ నేతలు దురుద్దేశంతోనే దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Palla Srinivas Speech: ఎన్టీఆర్ ఆశయాల సాధనకు చంద్రబాబు వెంటే నేనూ

Zodiac Signs: మీరు ఈ రాశిలో పుట్టారా మీకు బ్యాడ్ టైమ్ స్టార్ కాబోతుందని తెలుసా

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 29 , 2025 | 04:26 PM