జగన్‌కు షాకిచ్చిన తిరుపతి కార్పొరేటర్లు..

ABN, Publish Date - Jul 25 , 2024 | 08:14 AM

తిరుపతి: వారు వస్తామంటున్నారు.. కానీ వీరు వద్దంటున్నారు. ఇద్దరి మధ్యలో ఆ ఎమ్మెల్యే నలిగిపోతున్నారు. వైసీపీ కండువా మార్చేసేందుకు కార్పొరేటర్ల రెడీగా ఉన్నా.. కూటమి పార్టీల కేడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పవర్ లేకపోవడంతో ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు ఊపరి పీల్చుకోలేకపోతున్నారా? కూటమి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఒక్కసారిగా జంప్ అయ్యే ప్లాన్‌లో ఉన్నారు.

తిరుపతి: వారు వస్తామంటున్నారు.. కానీ వీరు వద్దంటున్నారు. ఇద్దరి మధ్యలో ఆ ఎమ్మెల్యే నలిగిపోతున్నారు. వైసీపీ (YCP) కండువా మార్చేసేందుకు కార్పొరేటర్ల (Corporators) రెడీగా ఉన్నా.. కూటమి పార్టీ (Kutami Party)ల కేడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పవర్ లేకపోవడంతో ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు ఊపరి పీల్చుకోలేకపోతున్నారా? కూటమి గ్రీన్ సిగ్నల్ (Green Signal) ఇవ్వగానే ఒక్కసారిగా జంప్ అయ్యే ప్లాన్‌లో ఉన్నారు.


అనుకున్నదే అవుతోంది. తిరుపతి కార్పొరేషన్‌లోని వైసీపీ కార్పొరేటర్లు ఎన్డీఏ కూటమిలో చేరేందుకు పడుతున్న ఉత్సాహం ఓ కొలిక్కి వస్తోంది. వైసీపీలో ఇక ఇమడలేమని, మేమొచ్చేస్తాం ప్లీజ్‌..! అంటూ పలువురు ముందుకొస్తున్నారు. ఈనేపథ్యంలో తుడా మాజీ చైర్మన్‌ ఎన్వీ ప్రసాద్‌ నేతృత్వంలో ఆదివారం స్థానిక కెన్సెస్‌ హోటల్లో రహస్య సమావేశం జరిగింది. డిప్యూటీ మేయర్‌ ముద్ర నారాయణతో పాటు కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్రనాథ్‌, అమరనాథ్‌ రెడ్డి, అనిల్‌, కుడితి సుబ్రమణ్యం, మహిళా కార్పొరేటర్ల భర్తలు, కుటుంబ సభ్యులు దొడ్డారెడ్డి మునిశేఖర్‌ రెడ్డి, తిరుత్తణి వేణుగోపాల్‌, దూది శివ, బాలాజీ తదితరులు హాజరైనట్టు తెలిసింది. ఒక్కొక్కరు వేర్వేరుగా ఎన్వీ ప్రసాద్‌తో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. బేషరతుగా కూటమిలో చేరుతామని కొందరు చెబితే, మరికొంతమంది వారి వ్యక్తిగత డిమాండ్లను, మళ్లీ కార్పొరేటర్‌ టికెట్‌ తమకే ఇవ్వాలన్న నిబంధన కూడా పెట్టినట్టు తెలిసింది. అదేవిధంగా అవిశ్వాసంలో కొత్తకౌన్సిల్‌ కొలువుతీరితే డిప్యూటీ మేయర్‌ పదవులను తమకే ఇవ్వాలని పలువురు కోరినట్టు సమాచారం.


మేయర్‌ రాకకోసం

కౌన్సిల్లో కూటమి పార్టీలకు బలం పెరిగినా నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టి మేయర్‌ను తొలగించే అవకాశం లేదు. కౌన్సిల్‌ ఏర్పాటై ఇప్పటికి మూడన్నరేళ్లు దాటేసింది. అయితే ప్రస్తుత మేయర్‌ డాక్టర్‌ శిరీష కూటమి పార్టీలో చేరిపోతే ఆమే మేయర్‌గా అధికార పక్షంలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ ఎన్నికలు జరిగేవరకు ఆమెనే కొనసాగించేందుకు మెజార్టీ కార్పొరేటర్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ ఆమె వైసీపీలోనే కొనసాగితే మరో ఆరు నెలల్లో అవిశ్వాస తీర్మానానికి కూటమి కార్పొరేటర్లు సిద్ధపడే అవకాశం ఉంది. మేయర్‌ కూటమిలో చేరుతుందన్న ప్రచారం ఓవైపు జరుగుతున్నప్పటికీ ఆమె నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు..

వ్యవస్థలను కుప్పకూల్చారు!

పెద్దిరెడ్డి ఖాతాలో ‘అసైన్డ్‌’

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 25 , 2024 | 08:14 AM