siddharth Yadav: బేబీ నన్నెందుకు వదిలేసి వెళ్లావ్..
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:41 PM
siddharth: నిశ్చితార్థం జరిగి.. పట్టుమని 10 రోజులు అయిందో లేదో.. అంతలోనే తన చేయి పట్టుకొని నిండు నూరేళ్లు నడిపిస్తాడనుకొన్న వాడు.. విగత జీవిగా మారాడు. దీంతో ఆమె కన్నీటి పర్యంత మైంది. ఆ క్రమంలో నన్ను తీసుకు వెళ్లడానికి వస్తానని చెప్పి.. ఇలా విగత జీవిగా రావడం ఆ యువతి తట్టుకో లేకపోయింది. దీంతో ఆమె బేబీ నన్నెందుకు వదిలేసి వెళ్లావంటూ ఆ పార్దీవ దేహంపై పడి రోదించింది. ఈ ఘటన అక్కడి వారిని తీవ్రంగా కలిచి వేసింది.

మనం ఒకటి అనుకొంటాం. వాళ్లు ఒకటి అనుకొంటారు. కానీ పైవాడు అంటే.. దేవుడు ఏం అనుకొంటాడో అదే జరిగి తీరుతోంది. సోనియా విషయంలో అదే జరిగింది. సిద్ధార్థతో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఈ ఏడాది అంటే.. 2025, నవంబర్ 2వ తేదీన సిద్ధార్థ యాదవ్‌తో సోనియాకు వివాహం జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఆ క్రమంలో గత నెల మార్చి 23వ తేదీన వీరిద్దరికి తాంబులాలు (ఎంగేజ్‌మెంట్) జరిగింది. ఈ కార్యక్రమం చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. అనంతరం గుజరాత్‌లోని జామ్ నగర్‌లో జాగ్వర్ ఫైటర్‌గా విధుల్లో చేరారు.
అయితే సిద్ధార్థ విధుల్లో భాగంగా జాగ్వర్ ఫైటర్ ప్రమాదానికి గురై మరణించాడు. దీంతో అతడి మృతదేహం శుక్రవారం హర్యానా రేవారీలోని భల్కి మజ్రా గ్రామానికి తీసుకు వచ్చారు. దీంతో అతడి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆ క్రమంలో సోనియా సైతం ఆ గ్రామానికి చేరుకొంది. వివాహం అనంతరం సిద్దార్థ..తనను తీసుకు వెళ్తాడని ఆమె భావించింది. కానీ మనం ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలిచినట్లుగా అంతా తారుమారైపోయింది.
కన్నీటి పర్యంతమైన సోనియా..
సిద్ధార్థ మృతదేహం చూసి సోనియా కన్నీటి పర్యంతమైంది. బేబీ..నువ్వు నన్ను తీసుకెళ్లడానికి రాలేదు...నన్ను తీసుకెళ్లడానికి వస్తానని చెప్పావు అంటూ మృతదేహం చూసి ఆమె కన్నీటి పర్యంతం కావడం అక్కడున్న వారిని తీవ్రంగా కలచి వేసింది. ఆమెను సముదాయించడం అక్కడున్న బంధవుల వల్ల కాలేదు. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి అయిపోయిందంటారు. ఈ కార్యక్రమం జరిగి పట్టుమని 10 రోజులు అయిందో లేదో.. సిద్ధార్థ ఇలా విగత జీవిగా మారడాన్ని సోనియా తట్టుకో లేక పోయింది.
అనంతరం భల్కి మజ్రా గ్రామంలో సిద్ధార్థ యాదవ్ మృతదేహానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఏప్రిల్ 2న జామ్‌నగర్‌లో జరిగిన జాగ్వార్ ప్రమాదంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ మరణించారు. అతడు చనిపోయే ముందు.. తన సహచరుడి ప్రాణాలను కాపాడాడని సైనిక అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
ప్లీజ్.. అన్నామలైని మార్చొద్దు
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News