విజయ్ చివరి చిత్రం రెమ్యూనరేషన్ ఎంతంటే..

ABN, Publish Date - Sep 16 , 2024 | 07:42 AM

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులతో తమిళ చిత్రసీమలో అగ్రనటుడు విజయ్. ఇటీవల ఆయన నటించిన ‘ది గోట్’ చిత్రం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ చివరి చిత్రం ‘దళపతి 69’పై అభిమానుల అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి.

తెలుగు ప్రేక్షకులకు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ తమిళంతో పాటు తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. కాగా ఈ దేశంలోనే రెండో అతిపెద్ద ఇన్‌కం టాక్స్ కడుతున్న తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రికార్డు సృష్టించారు. షారుఖ్ ఖాన్ కన్నా కొంచెం తక్కువ పన్ను చెల్లింపు అంతే. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 80 కోట్లు ఆదాయం పన్ను చెల్లించారు. మరి కొన్ని రోజుల్లో సినిమాల నుంచి రిటైర్ కాబోతున్న విజయ్.. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల జాబితాలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ , ప్రభాష్, సల్మాన్ లాంటి వారిని పక్కకు నెట్టినట్లు సమాచారం.


ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులతో తమిళ చిత్రసీమలో అగ్రనటుడు విజయ్. ఇటీవల ఆయన నటించిన ‘ది గోట్’ చిత్రం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ చివరి చిత్రం ‘దళపతి 69’పై అభిమానుల అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ప్రముఖ దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అలాగే దళపతి 69 పోస్టర్లు కూడా విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ తన చివరి చిత్రం దళపతి 69 పారితోషికంతో భారత దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా షారుఖ్ ఖాన్‌ను క్రాస్ చేశారు. షారుఖ్ ఖాన్ తన సినిమాలకు రూ. 250 కోట్లు సంపాదిస్తున్నప్పుడు.. తన చిత్రం దళపతి 69 కోసం రూ. 275 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.


కాగా తమిళ సినీ అభిమానులను దశబ్దాలుగా తనదైన స్టైల్ లో అలరించి, అగ్రస్థానాన్ని ఎంజాయ్ చేస్తున్న దళపతి విజయ్‌.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న ఆయన.. ఇక తన చివరి సినిమాను చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నెక్ట్స్ సినిమాను కూడా ప్రకటించారు. ఇప్పటిదాకా సీనిమా ఎవరితో ఉండబోతోందా? అన్న ప్రశ్నకు ఫుల్ స్టాప్ పెట్టేస్తూ డీటెయిల్స్ పంచుకున్నారు.

విజయ్ తన చివరి సినిమాను తమ బ్యానర్ లో చేయబోతున్నట్టు కె.వి.ఎన్‌.ప్రొడ‌క్షన్ ప్రకటించింది. అలాగే ఫ్యాన్స్‌కు 5 నిమిషాల 30 సెక‌న్ల హృద‌యానికి హ‌త్తుకునేలా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ వీడియోను షేర్ చేసింది. దశాబ్దాలుగా మనల్ని అలరించిన వ్యక్తి ఎప్పటికీ నిలిచిపోయే వేడుకలను రూపొందించడానికి చివరి క్షణంలో అడుగుపెడుతున్నారు అంటూ మూవీని అనౌన్స్ చేసింది. ఈ వీడియోను విజయ్ సినిమాటిక్ జర్నీతో డిజైన్ చేశారు. ఇది చూస్తుంటే విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఇదే ఆయన చివరి సినిమాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వీడియోలో.. విజయ్ సినిమాలు ఫ్యాన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు.. విజయ్ వల్ల ఎంతమంది సహాయం పొందారు.. విజయ్ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు.. అంటూ ఫ్యాన్స్ మాటల్లో, కొన్ని విజువల్స్ తో ఎమోషనల్ గా చూపించారు.


పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో 'దళపతి 69'

‘దళపతి 69’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రానికి హెచ్‌ వినోద్ దర్శకత్వం వహించనున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈమూవీ 2025 అక్టోబర్ లో రిలీజ్ కానుంది. వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. హీరోయిన్ గా సమంత, పూజాహెగ్డే పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ప్రేమలు ఫేమ్ మమితా బైజు కూడా కథానాయికగా నటిస్తుందని టాక్. ఇక యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నాడు. క్రేజీ కాంబినేషన్ తో రాబోతున్న ఈ మూవీపై అప్పుడే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. అయితే ఈ సినిమాలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు కూడా కనిపించబోతున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానులు ఏమోషనల్ అవుతున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని, ఆయన పొలిటికల్ జర్నీ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నారు.

Updated at - Sep 16 , 2024 | 07:42 AM