ఉద్యోగం లేదు.. చేతిలో రూపాయి లేదు.. కట్ చేస్తే రాత్రికి రాత్రే
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:43 AM
కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న ఓ వ్యక్తిని అదృష్టం పలకరించింది. అప్పటి వరకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేని వ్యక్తి.. రాత్రికి రాత్రే కోటీశ్వర్వడయ్యాడు. మరి ఇంతకు అతడి జీవితంలో ఏం జరిగింది.. ఎలా కోటీశ్వరుడు అయ్యాడంటే..

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేము. లక్కు తలుపు తడితే.. అప్పటి వరకు మనల్ని అంటి పెట్టికుని ఉన్న కష్టాలన్నీ పటాపంచలు అవుతాయి. తాజాగా ఓ వ్యక్తి విషయంలో ఇదే జరిగింది. ఉద్యోగం లేక.. రూపాయి సంపాదన లేదు.. దీనికి తోడు అతడి కుమారుడు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇలాంటి దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని అదృష్టం వరించింది. ఇంకేముంది రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడయ్యాడు. ఆ వివరాలు..
ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. జెఫ్రి అలెన్ అనే వ్యక్తి రాత్రికి రాత్రే 10 మిలియన్ డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీలో రూ.85,76,29,000 గెలుచుకున్నాడు. దీనికి ముందు వరకు కనీసం జాబ్ కూడా లేకుండా.. రూపాయి సంపాదన లేక.. కొడుకు అనారోగ్యం గురించి బాధపడుతున్న జెఫ్రీ.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మరి ఇది ఎలా జరిగిందంటే..
అమెరికాలో మిస్టర్‌బీస్ట్‌గా పాపులర్ అయిన జిమ్మీ డోనాల్డ్సన్ అనే వ్యక్తి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా.. ఓ రియాలిటీ షోను నిర్వహిస్తున్నాడు. దీనిలో గెలిచిన వారు 10 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీగా పొందుతారు. సుమారు 1000 మంది దీని కోసం పోటీ పడతారు. జెఫ్రీ అలెన్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా షోలో పాల్గొన్న జెఫ్రీ.. ఎవరూ ఊహించని రీతిలో కోట్ల రూపాయల ప్రైజ్ మనీని గెలుపొందాడు.
ఈ సందర్భంగా జెఫ్రీ మాట్లాడుతూ.. "ఈ షోలో పాల్గోనేముందు వరకు నా జీవితంలో అన్ని కష్టాలే. జాబ్ లేదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు. పైగా నా కొడుకు అరుదైన మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అలాంటి సమయంలో నేను ఈ షోలో పాల్గొనడం కోసం అప్లై చేసుకున్నాను. అది కూడా ప్రైజ్ మనీ గెలవడం కోసం కాదు. నా కొడుకు అనారోగ్యం గురించి చెప్పి సాయం పొందాలని భావించాను. కానీ షోలో పాల్గొనబోతున్నట్లు నాకు తెలిసినప్పుడు నా ఆలోచనా విధానం మారింది. సాయం కోరే బదులు నేనే షోలో గెలిస్తే.. నా సమస్యలు తీరుతాయి కదా అనిపించింది. అదే సంకల్పంతో షోలో పాల్గొని.. విజయం సాధించాను" అని చెప్పుకొచ్చాడు.
"అయితే నేను ఈ షోలో పాల్గొంటున్నట్లు కనీసం నా భార్యకు కూడా చెప్పలేదు. సీక్రెట్‌గానే ఉంచాను. నేను ఈ షోలో పాల్గొంటున్నాను అని చెబితే నా మీద అందరూ నమ్మకం పెట్టుకుంటారు. ఒక వేళ నేను గెలవకపోతే.. వారి ఆశ.. నిరాశ అవుతుంది. నా భార్యకు చెబితే.. మా కష్టాలు తీరతాయని.. బాగా డబ్బు వస్తుందని నమ్మకం పెట్టుకునే అవకాశం ఉంది. అందుకే తనకు కూడా దీని గురించి చెప్పలేదు" అన్నాడు.
"నా అదృష్టం బాగుండి నేను ఈ షోలో విన్ అయ్యి 10 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాను. ఈ డబ్బులో 2 లక్షల డాలర్లను ఓ పరిశోధన సంస్థకు విరాళం ఇస్తాను. ఈ సంస్థ నా కుమారుడికి వచ్చిన అరుదైన వ్యాధి గురించి పరిశోధిస్తుంది. నేను ఇచ్చే విరాళం వారికి ఉపయోగపడతాయి" అని చెప్పుకొచ్చాడు. అతడి ఆలోచనను అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
ట్రంప్‌ను గెలిపించుకున్నాక అమెరికా యువకుడి భార్య అరెస్టు! ఇప్పుడతడి పరిస్థితి ఏంటంటే..
ఎగిరే విమానంలో లేడీ రచ్చ.. చివరికి తగులబెట్టే ప్రయత్నం