Share News

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:39 PM

మావోయిస్టులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఐదు రోజుల క్రితం చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో భారీ సంఖ్యలో మావోలు మృతి చెందగా.. నేడు (మంగళవారం) జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మరి కొందరు మావోలు కన్ను మూశారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి
Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో మరో సారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్-దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలుపుతున్నారు. ఘటనా స్థలం దగ్గర భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.


నేడు(మంగళవారం) ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందడంతో.. వారు సర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈక్రమంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.


గత వారం అనగా మార్చి 20న ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు చనిపోయారు. అదే రోజు కాంకెర్ జిల్లాలో చోటు చేసుకున్న మరో ఘటనలో నలుగురు మావోలు మృతి చెందారు. నేడు(మంగళవారం) జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోలు మృతి చెందడం.. మావోయిస్టులకు భారీ షాక్ అనే చెప్పవచ్చు. ఐదురోజుల వ్యవధిలో 3 ఎన్‌కౌంటర్లు జరగడం.. 30 మందికి పైగా మావోలు చనిపోవడం సంచలనంగా మారింది. ఇక మార్చి 20న చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఒక జవాను కూడా చనిపోయాడు.

రెండు రోజుల క్రితం మావోలు బీజాపూర్ ప్రాంతంలో భద్రతా బలగాలతో వస్తున్న వాహానాన్ని పేల్చివేసేందుకు ప్రయత్నించారు. కానీ వెంట్రుకవాసిలో జవాన్లు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఇవి కూడా చదవండి:

వాహనదారులకు పిడుగులాంటి వార్త.. 1 నుంచి టోల్‌ బాదుడు..

నాలుగు రోజులు ఎండ తీవ్రం.. మధ్యాహ్నం ఇంటివద్దే ఉండండి

Updated Date - Mar 25 , 2025 | 12:47 PM