Chennai: ఏనుగు, చిరుతపులి దంతాల స్వాధీనం
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:38 PM
వన్యప్రాణులను కాపాడేందుకు ఎన్నో కఠిన చట్టాలను రూపొందిస్తున్నా.. వేట మాత్రం ఆగడం లేదు. తాజాగా ఏనుగు, చిరుతపులి దంతాలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- నలుగురి అరెస్ట్
చెన్నై: కోయంబత్తూరు జిల్లాలో ఏనుగు, చిరుతపులి దంతాలు తరలించి విక్రయించేందుకు యత్నించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సేలం(Selam) జిల్లా మేట్టూరు నుంచి కోయంబత్తూర్‌కు ఏనుగు దంతం, చిరుతపులి దంతాలు అక్రమంగా తరలిస్తున్నట్లు కోయంబత్తూర్ అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది.
ఈ వార్తను కూడా చదవండి: Hero Vijay: హీరో విజయ్ వార్నింగ్.. కపట నాటకాలతో జాక్టో-జియోను మోసగించొద్దు
దాని ఆధారంగా ఫారెస్ట్ రేంజర్(Forest Ranger) నేతృత్వంలో సిబ్బంది శనివారం రాత్రి గాంధీపురం రాంనగర్ రామాలయం(Gandhipuram Ramnagar Ram Temple) సమీపంలో వాహన తనిఖీలు చేపట్టగా, అటువైపు వచ్చిన కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఏనుగు దంతం, చిరుతపులి దంతాలుండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న కృప (24), సతీష్‌కుమార్ (26), విజయన్ (45), గౌతమ్ (26)లను అరెస్ట్ చేసి, వీటిని ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడ విక్రయించేందుకు వెళ్లున్నారు సహా పలు కోణాల్లో విచారణ చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టీవీ నటిపై లైంగిక దాడికి యత్నం
పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం
Read Latest Telangana News and National News