రజినీ ఫిర్యాదుతోనే తనిఖీలు: జాషువా
ABN, Publish Date - Mar 25 , 2025 | 12:20 PM
వైఎస్సార్‌సీపీ నేత, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్‌పై ఫిర్యాదు చేశారని, ఆమె పిర్యాదుతోనే తనిఖీలు చేసినట్లు ఐపీఎస్ అధికారి పల్లె జాషువా వెల్లడించారు.
అమరావతి: మైనింగ్ కేసు (Mining Case)లో మాజీ మంత్రి విడదల రజినీ (Vidadala Rajini) అడ్డంగా బుక్కయ్యారా.. అధికారంలో ఉండగా మైనింగ్ వ్యవహారంలో కథ, స్క్రీన్ ప్లే అంతా ఆమే నడిపించారా.. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి, పాత్ర ధారి విడదల రజినేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వైఎస్సీర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే విడదల రజీనీ ఫిర్యాదుతోనే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్‌లో తనిఖీలు చేపట్టామని ఐపీఎస్ అధికారి పల్లె జాషువా (IPS Officer Palle Joshuva) విజిలెన్స్ (Vigilance) అధికారులకు వివరించారు. గుంటూరు జిల్లా ఆర్వీఈవోగా తాను పనిచేస్తున్న సమయంలో ఆమె స్వయంగా విజిలెన్స్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Also Read..: మీర్‌పేట మాధవి హత్య కేసులో కీలక మలుపు..
యడ్లపాడు మండలంలోని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం మైనింగ్ తవ్వకాల్లో రాయల్టీ, కంకర విక్రయాల్లో ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతోందని విడదల రజినీ రాసిచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, తనపై ఫిర్యాదు అందిన తర్వాత గుంటూరు విజిలెన్స్ కార్యాలయంలో ఆ ఫిర్యాదు కాపీ మాయమైందని తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాల్లో ఒకటైన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిపై వేధింపుల వ్యవహారం కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ విచారణను దాటి ఏసీబీలో కేసు నమోదు వరకు చేరింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
ABN Live..: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
పోలీస్ వాహనంపై రాళ్లతో ఆందోళనకారుల దాడి
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
For More AP News and Telugu News
Updated at - Mar 25 , 2025 | 12:20 PM