Share News

Yearender 2024: మంచి మాట‌లే మోదీ దౌత్య సాధ‌నాలు

ABN , Publish Date - Dec 27 , 2024 | 09:08 PM

మ‌న విదేశాంగ విధానం సాంస్కృతిక రంగంలో ద‌గ్గర‌వుతూనే, వ్యూహాత్మక భాగ‌స్వామ్యాన్ని స‌మ్మిళితం చేస్తున్నది. ప్రపంచానికి భార‌త దేశ నాయ‌క‌త్వం వ‌హించ‌గ‌ల‌దనే స్పష్టమైన ముందుచూపును ప్రద‌ర్శిస్తున్నది.

Yearender 2024: మంచి మాట‌లే మోదీ దౌత్య సాధ‌నాలు

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ మ‌న దేశ దౌత్య విధానానికి స‌రికొత్త రూపునిచ్చారు. మంచి మాట‌ల‌తో సాంస్కృతిక‌, ఆర్థిక స‌త్సంబంధాల‌తో అనేక దేశాల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. దీనినే సాఫ్ట్‌ప‌వ‌ర్ డిప్లమ‌సీ అంటున్నారు. ఆయ‌న విధానాలు స‌త్ఫలితాలు ఇస్తున్నాయ‌ని చెప్పడానికి నిద‌ర్శనం ఆయ‌న‌కు ల‌భించిన 20 దేశాల అత్యున్నత స్థాయి పౌర పుర‌స్కారాలే. అయితే, కెన‌డా, మాల్దీవులు, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఈ విధానానికి స‌వాళ్లు విసురుతున్నాయి. ఈ పుర‌స్కారాల‌ను ఇచ్చిన దేశాల్లో అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలు ఉండ‌టాన్నిబ‌ట్టి, న‌చ్చజెప్పి స‌త్సంబంధాల‌ను ఏర్పర‌చుకునే దౌత్యానికి ఎంత శ‌క్తి ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. వ్యక్తిగ‌తంగా మోదీతోపాటు అంత‌ర్జాతీయంగా భార‌త దేశానికి పెరుగుతున్న ప్రాధాన్యం దీనిలో క‌నిపిస్తుంది. అంతేకాకుండా, ద్వైపాక్షిక సంబంధాలు, ప‌ర‌స్పర గౌర‌వం, అంత‌ర్జాతీయ దౌత్యానికి భార‌త్ పోషిస్తున్న పాత్ర వంటివి ఈ పుర‌స్కారాల్లో ప్రతిబింబిస్తాయి.

Yearender 2024: మోదీ దూకుడుకు క‌ళ్లెం


modi1.jpg

మ‌న విదేశాంగ విధానం సాంస్కృతిక రంగంలో ద‌గ్గర‌వుతూనే, వ్యూహాత్మక భాగ‌స్వామ్యాన్ని స‌మ్మిళితం చేస్తున్నది. ప్రపంచానికి భార‌త దేశ నాయ‌క‌త్వం వ‌హించ‌గ‌ల‌దనే స్పష్టమైన ముందుచూపును ప్రద‌ర్శిస్తున్నది.


modi2.jpg

ప‌శ్చిమ దేశాల‌తో సంబంధాల్లో గ‌తంలో ఇంధ‌నం, కార్మిక వ‌ర్గంపైన మాత్రమే మ‌న దేశం ప్రధానంగా ద‌ృష్టి సారించేది. మోదీ వ‌చ్చిన త‌ర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, బ‌హ్రెయిన్ వంటి దేశాల నుంచి వాణిజ్యం, మౌలిక స‌దుపాయాలు, టెక్నాల‌జీ వంటి రంగాల్లోకి పెట్టుబ‌డులు వ‌చ్చేలా చేస్తున్నారు. దీంతో సంప్రదాయ‌బ‌ద్ధమైన చ‌మురు ఆధారిత ఆర్థిక వ్యవ‌స్థల‌కు అతీతంగా స‌త్సంబంధాలు ఏర్పడుతున్నాయి. దీంతో ప‌శ్చిమాసియా దేశాల‌పై భార‌త్ అర్థవంత‌మైన ప్రభావాన్ని చూపుతున్నది.


modi3.jpg

యుద్ధాల్లో ఉన్న దేశాల‌తో కూడా స‌మ‌తుల్యత‌ను భార‌త్ చాక‌చ‌క్యంగా పాటిస్తున్నది. పాల‌స్తీనా-ఇజ్రాయెల్‌, ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధాలు జ‌రుగుతున్నప్పటికీ, భార‌త‌దేశ ప్రయోజ‌నాల‌కే మోదీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. మోదీకి పాల‌స్తీనా త‌న అత్యున్నత స్థాయి పౌర పుర‌స్కారాన్ని ఇచ్చింది, అదే స‌మ‌యంలో ఇజ్రాయెల్‌తో భార‌త్ స‌త్సంబంధాలు చెక్కు చెద‌ర‌లేదు. భిన్న ధ్రువాలైన ర‌ష్యా, అమెరికాల‌తో కూడా మోదీ దౌత్య విధానం స‌మ‌తుల్యత‌ను పాటిస్తున్నది. భ‌ద్రత‌, ఇంధ‌న రంగాల్లో ర‌ష్యా వ్యూహాత్మక భాగ‌స్వామిగా కొన‌సాగుతున్నది. టెక్నాల‌జీ, ర‌క్షణ‌, వాణిజ్య రంగాల్లో అమెరికాతో సంబంధాలు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. మోదీకి ఈ రెండు దేశాలు త‌మ అత్యున్నత స్థాయి పౌర పుర‌స్కారాల‌ను ఇచ్చి, గౌర‌వించాయి. దీనిని బ‌ట్టి న‌చ్చజెప్పి, ఒప్పించే దౌత్య విధానం వ‌ల్ల అంద‌రి మ‌న్నన‌లు పొంద‌వ‌చ్చున‌ని స్పష్టమ‌వుతున్నది. మ‌రోవైపు మోదీ వివిధ దేశాల నేత‌ల‌తో వ్యక్తిగ‌తంగా స‌త్సంబంధాల‌ను ఏర్పర‌చుకోవ‌డం దేశానికి మ‌రింత ప్రయోజ‌న‌క‌రంగా మారింది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మోదీని ఎంతగా ఇష్టప‌డ‌తారో తెలిసిందే. అయితే, ఈ దౌత్యవిధానం కెన‌డా, బంగ్లాదేశ్‌, మాల్దీవులలో సత్ఫలితాల‌ను ఇవ్వలేదు. మాల్దీవులు ఇప్పుడిప్పుడే కాస్త మెత్తబ‌డిన‌ట్లు క‌నిపిస్తున్నా, కెన‌డా, బంగ్లాదేశ్ మ‌న దేశం ప‌ట్ల తీవ్ర వ్యతిరేక‌త‌ను క‌న‌బ‌రుస్తున్నాయి. ఈ దేశాల‌ను దారిలోకి తెచ్చుకోవ‌డానికి మోదీ, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంక‌ర్ ఎలాంటి వ్యూహాల‌ను అనుస‌రిస్తారో చూడాలి.


For Rewind 2024 News కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

For National News And Telugu News

Updated Date - Dec 27 , 2024 | 10:11 PM