Aadhaar Enrollment Camps: ఆధార్ నమోదుకు ప్రత్యేక క్యాంపులు
ABN , Publish Date - Apr 02 , 2025 | 05:20 AM
ఆరేళ్ల లోపు పిల్లలు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపులకు (PVTG) ఆధార్ నమోదు కోసం ఏప్రిల్ 3-11 మధ్య ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 1.95 లక్షల పిల్లలు, 34,995 PVTG ప్రజలకు ఆధార్ కార్డులు మంజూరు చేయడం పెండింగ్‌లో ఉందని తెలిపారు

ఆరేళ్ల లోపు పిల్లలు, పీవీటీజీల కోసం ఏర్పాటు
అమరావతి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల లోపు పిల్లలకు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపు(పీవీటీజీ)లకు ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టేందుకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయాలని గ్రామ, వార్డ్ సచివాలయ శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. ఇప్పటికే మార్చి నెలలో ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేశామని, కొనసాగింపుగా ఏప్రిల్ 3 నుంచి 5 వరకు, 8 నుంచి 11వ తేదీ వరకు ఆయా అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్ల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. 1.95 లక్షల మంది పిల్లలు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం కలిగి ఉన్నారని, వారందరికీ ఆధార్ నమోదు పెండింగ్‌లో ఉందని తెలిపారు. అదే విధంగా 10 జిల్లాలకు సంబంధించి 34,995 మంది పీవీటీజీలకు ఆధార్ కార్డులు లేవని గిరిజన సంక్షేమశాఖ డేటా ఇచ్చిందన్నారు. గతంలో ఆధార్ కార్డులు లేని పీవీటీజీలకు, పిల్లలకు ఆధార్ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News