ఏపీకి ఏరో స్పేస్, డిఫెన్స్ పారిశ్రామిక రంగాలు..
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:43 AM
ఏపీకి ఏరో స్పేస్, డిఫెన్స్ పారిశ్రామిక రంగాలు వచ్చేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలత ప్రకటించారని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అధ్యక్షతన మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో శివనాథ్ పాల్గొన్నారు.

వన్‌టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : ఏపీకి ఏరో స్పేస్, డిఫెన్స్ పారిశ్రామిక రంగాలు వచ్చేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలత ప్రకటించారని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అధ్యక్షతన మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో శివనాథ్ పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి ఎంపీలందరూ తమ నియోజకవర్గ పరిధిలోని సమస్యలు, కేంద్ర పథకాల అమలు, నిధుల అవసరాలు తదితరాలను తెలుసుకునే క్రమంలో శివనాథ్‌తో పాటు బస్తిపాటి నాగరాజు పంచలింగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఎంపీ మాట్లాడుతూ, ఏపీలో ఏరో స్పేస్, డిఫెన్స్ పరికరాల తయారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు సహకరించాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరితో ఎంపీ చర్చించారు.
ఏపీలో భూగర్భ ఉష్ణశక్తి ఉత్పత్తి ప్లాంట్ ప్రతిపాదనలు లేవు
8 కేంద్ర మంత్రి శ్రీపాద యశో నాయక్ వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ ఉష్ణశక్తి (జియోథర్మల్ ఎనర్జీ) ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర విద్యుత, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ వెల్లడించారు. ఎంపీ కేశినేని శివనాథ్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు బుధవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారత ప్రభుత్వం ‘‘పునరుత్పాదక శక్తి పరిశోధన, సాంకేతిక అభివృద్ధి కార్యక్రమం’’ ద్వారా భూ ఉష్ణశక్తి అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎ్‌సఐ) 381 భూ ఉష్ణశక్తి ప్రాంతాలపై అధ్యయనం చేసి జియోథర్మల్ అట్లాస్ ఆఫ్ ఇండియా-2022 నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 10,600 మెగావాట్ల భూగర్భ ఉష్ణశక్తి ఉత్పత్తి సామర్ధ్యం ఉందని అంచనా వేయబడిందని.. అయితే ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్యేక ప్రాంతాల వివరాలు లేవన్నారు. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద సింగరేణి కొల్లియరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) కిలోవాట్ల భూగర్భ ఉష్ణశక్తి ప్లాంట్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారరంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ ఉష్ణశక్తి ప్లాంట్‌కు ఎటువంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దీంతో పాటు ఏపీలో భూగర్భ ఉష్ణశక్తి ప్రాజెక్టుల కోసం ఎటువంటి నిధులు కేటాయించలేదని కేంద్ర మంత్రి తెలిపారు.
డీఆర్డీవో చైర్మన్‌తో ఎంపీ భేటీ
ఎంపీ కేశినేని శివనాథ్ బుధవారం ఢిల్లీలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) చైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు తిరుపతి ప్రసాదం అందజేశారు. నూతన రాజధాని అమరావతిలో భాగమైన విజయవాడ పరిసరప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి రక్షణ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఎంపీ కోరగా సమీర్ విక్రాంత సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు.