Share News

LOANS : రుణం... గరం..గరం..!

ABN , Publish Date - Mar 04 , 2025 | 12:00 AM

సబ్సిడీ రుణాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లు తెలు స్తోంది. ఈ క్రమంలో మండల స్థాయి నాయకులను కలుస్తున్న వారి సం ఖ్య పెరుగుతోంది. అయితే అనుకున్న స్థాయిలో రుణాల యూనిట్లు మం డలానికి మంజూరు కాకపోవడం నాయకులకు తలనొప్పిగా మారుతోంది.

LOANS : రుణం... గరం..గరం..!
Applicants who appeared for interviews for subsidized loans (File)

- సబ్సిడీ రుణాలకు పెరుగుతున్న పోటీ

- స్థానిక నాయకులపై పట్టుపడుతున్న ఆశావాహులు

- సర్దిచెప్పే మాటలను వినని వైనం

అనంతపురం రూరల్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి): సబ్సిడీ రుణాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లు తెలు స్తోంది. ఈ క్రమంలో మండల స్థాయి నాయకులను కలుస్తున్న వారి సం ఖ్య పెరుగుతోంది. అయితే అనుకున్న స్థాయిలో రుణాల యూనిట్లు మం డలానికి మంజూరు కాకపోవడం నాయకులకు తలనొప్పిగా మారుతోంది. రుణాల కోసం తమ వద్దకు వచ్చే వారికి ఏం సమాధానం చెప్పలేని స్థితిలో పడిపోయారు. సర్దిచెప్పే విధంగా మాట్లాడితే అంతే సంగతి. వారి మాటలకు పెడర్థాలు తీస్తూ పలు విధాల వంకలు పెడుతున్నారు. ఈక్రమంలో రుణం మంజూరు ప్రక్రియ కాస్త గరం..గరం మారుతోంది.


యూనిట్లు తక్కువ... పోటీ ఎక్కువ

గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు సబ్బిడీ రుణాల ఊసేలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరిగి సబ్సిడీ రుణాల మంజూరు చేపట్టిం ది. ఈ క్రమంలో ఆశావాహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. మం డలంలో అనంతపురం అర్బన పరిధిలోని నాలుగు పంచాయతీలకు, రాప్తా డు నియోజకవర్గంలోని రూరల్‌ పరిధిలో 21 పంచాయతీలకు కలసి 70 యూనిట్ల రుణాలు మంజూరయ్యాయి. ఇందులో రూరల్‌ పరిధిలో 21 పంచాయతీలకు సంబంధించి బీసీ కులాలకు 30యూనిట్లు, ఈబీసీ, ఇతర కార్పొరేషనలకు 9, జనరిక్‌ మెడికల్‌ షాపుల్లో బీసీలకు రెండు, ఈబీసీ, ఇతర కార్పొరేషనలకు మూడు (రెడ్డి కార్పొరేషన-1, బ్రాహ్మణ కార్పొరేషన-1, కమ్మ కార్పొరేషన-1) చొప్పున మంజూరయ్యాయి. అదేవిధంగా కాపు కులా లకు ఐదు యూనిట్లు మంజూరు చేశారు. మొత్తం 55 యూనిట్లు రూరల్‌ ప్రాంతాలకు కేటాయించారు. మిగిలినవి అర్బన పరిధిలోని నాలుగు పంచా యతీలకు కేటాయించారు. వీటికి మండల వ్యాప్తంగా 866 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు ఇటీవల ఇంటర్య్వులు పూర్తి చేశారు. దరఖాస్తులను బట్టి చూస్తే రుణాలకు ఏస్థాయిలో పోటీ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇది లా ఉండగా బ్యాంకుల వారీగా కేటాయించిన యూనిట్లపై సంబంధిత వ ర్గాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కులాలు తక్కువ ఉన్న చోట ఎక్కువ యూనిట్లు... ఎక్కువ కులాలున్న ప్రాంతాలకు తక్కువ యూనిట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత వర్గాల నుంచి అసహనం వ్యక్తం అవుతోంది.


తమకే రుణాలు దక్కాలని పట్టు

సబ్సిడీ రుణాల ప్రక్రియ ప్రారంభం నుంచి ఆశావాహులు వాటిపై ఆశలు పెట్టుకున్నారు. వారికి అనుకూలమైన, సన్నిహితంగా ఉన్న నాయ కులను కలిసి ఒత్తిడి తెస్తున్నారు. ఇంటర్వ్యూలు ముగిసిన తరువాత పరిస్థితి మరింత పెరిగింది. అయితే రుణ యూనిట్లు తక్కువగా ఉండటంతో ఎవరికి మంజూరు చేయించాలో తెలియని అయోమయ స్థితిలో నాయకు లు పడిపోయారు. సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తే ఆశావహులు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో అలకలు, గుసగులాడటం జరు గుతోంది. ఈ సంఘర్షణలో రుణాలు ఎవరికి దక్కుతాయో వేచిచూడాలి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 04 , 2025 | 12:00 AM